ANKURARPANA PERFORMED IN CHANDRAGIRI RAMALAYAM_ చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

Chandragiri, 26 March 2018: The festival of prelude, Beejavapanam or Ankurarpanam was performed in Sri Kodandarama Swamy temple in Chandragiri.

The annual brahmotsavams are scheduled from March 27 to April 4.

Temple DyEO Sri Subramanyam and other staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI


చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

మార్చి 26, తిరుపతి, 2018: టిటిడి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మేదినిపూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. మార్చి 27 నుండి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

మార్చి 27న ధ్వజారోహణం :

ఆలయంలో మార్చి 27వ తేదీ మంగళవారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, సాయంత్రం ఘంటానాదం, ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. మార్చి 28, 29, 31, ఏప్రిల్‌ 2, 3వ తేదీల్లో సాయంత్రం ఘంటానాదం, ఊంజల్‌సేవ చేపడతారు. మార్చి 30న రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఏప్రిల్‌ 1న సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగనున్నాయి. ఏప్రిల్‌ 4న ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్‌ 5వ తేదీ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.