CHANDRAGIRI KODANDARAMA TEMPLE KALYANAM _ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

TIRUPATI, 05 APRIL 2023: The celestial Sita Rama Kalyanam took place with religious fervour in Chandragiri Ramalayam on Wednesday.

In the evening Garuda Vahanam was held.

Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi, Superintendent Sri Srinivasulu, Temple Inspector Sri Gopala Krishna and other staffs were present.

A huge number of devotees participated in these events.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుప‌తి, 2023 ఏప్రిల్ 05: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ‌ సీతారాముల కల్యాణం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ కోదండరామస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ గోపాలకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది