CHANDRAGIRI MLA SARE TO KALYANA VENKANNA _ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామికి చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి సారె 

TIRUPATI, 15 FEBRUARY 2023: The traditional sare from Tummalagunta Sri Kalyana Venkateswara Swamy to Srinivasa Mangapuram Kalyana Venkateswara on behalf of Chandragiri legislator and TTD Trust Board member Sri Bhaskar Reddy was given by his family members on Wednesday.

Earlier the local legislator, MPP Sri Mohit Reddy were received by Superintendent Sri Chengalrayalu and other temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామికి చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి సారె

తిరుపతి, 2023 ఫిబ్ర‌వ‌రి 15: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి
బుధవారం టీటీడీ బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కుటుంబం తరవున సారె సమర్పించారు. ముందుగా తిరుప‌తి స‌మీపంలోని
తుమ్మ‌ల‌గుంట శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో సారె కు ప్ర‌త్యేక
పూజ‌లు నిర్వ‌హించారు.

ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర ద్రవ్యాలతో కూడిన సారెను చెవిరెడ్డి కుటుంబం తరపున మేళతాళాల మధ్య ఊరేగింపుగా శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీక‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందించారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న డా.చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి దంపతులకు, ఎంపీపీ శ్రీ మోహిత్ రెడ్డికి ఆలయ అధికారులు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, ప్రధాన అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.