CHANDRAPRABHA VAHANAM OBSERVED _ చంద్ర‌ప్రభ వాహనంపై ద‌ర్భార్ కృష్ణుడి అలంకారంలో గోవిందరాజస్వామి

Tirupati, 22 May 2024: On the Chandraprabha vahanam, Sri Govindaraja in Darbar Krishna Alankaram mused the devotees.

Both the Pedda Jeeyar and Chinna Jeeyar Swamijis of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్ర‌ప్రభ వాహనంపై ద‌ర్భార్ కృష్ణుడి అలంకారంలో గోవిందరాజస్వామి

తిరుపతి, 2024 మే 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు గోవిందరాజస్వామివారు చంద్ర‌ప్రభ వాహనంపై ద‌ర్భార్ కృష్ణుడి అలంకారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఎఫ్ ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, సూపరింటెండెంట్‌ శ్రీ నారాయ‌ణ‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ ధ‌నంజ‌యులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.