CHANDRASAHODARI RIDES CHANDRAPRABHA VAHANAM_ చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి

Tiruchanur, 21 November 2017: It’s a day of sibling love which is clearly witnessed on seventh day evening on Tuesday when Goddess Padmavathi Devi took celestial ride on Chandra Prabha Vahanam.

According to our puranas, both Goddess Maha Lakshmi (Padmavathi Devi is believed to be incarnation of Maha Lakshmi) and Lord Chandra emerged out of the milk ocean which is being churned by Asuras and Devas for Amritam. In this way both Goddess and Lord Chandra share sibling love.

On the pleasant day evening on Tuesday, Goddess took ride on Chandra Prabha Vahanam potraying “Gajendra Moksham” episode from Bhagavatam sending message that She is the protector of the needy and destroyer of the evil forces.

TTD EO Anil Kumar Singhal, JEO Tirupati Sri P Bhaskar, Spl Gr DyEO Sri Muniratnam Reddy, CVSO Sri Ake Ravikrishna, ACVSO Sri Sivakumar Reddy and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి

తిరుపతి, 2017 నవంబరు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.