CHANGE IN TIMINGS OF SUPRABHATA AND ABHISHEKA SEVAS ON  JUNE 21 _ జూన్‌ 21న సుప్రభాతం మరియు అభిషేకం సేవా సమయాల్లో మార్పు

TIRUMALA, June 20:  In connection with the ongoing Three” Day Annual Jyesthabhishekam Festival on June 21(2nd Day), the temple administration of Tirumala Tirupati Devasthanams(TTD) has taken a decision to change the timings of Suprabhata and Abhisheka sevas on this day alone.

As against the usual commencement of Suprabhata Seva during wee hours of 3am, the seva will commence in advance by 2am itself and for this the grihasta pilgrims are requested to report by 1am while for Abhisheka Seva which usually commences by4.30am, on that day, this seva will commence by 3.30am and the grihasta pilgrims are requested to report by 2.00am.

The pilgrims are requested to make note of these temporary change in the timings of Suprabhatam and Abhishekam sevas on June 21 and report on time as suggested at VQC-1 accordingly. The Dasavarshadarshini (DVD), Vimasathi Varshadarshini ( VVD) and Udayasthamana Sarva Seva grihastha are also to requested to make note of this change and co-operate with the TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 21న సుప్రభాతం మరియు అభిషేకం సేవా సమయాల్లో మార్పు

తిరుమల,  20 జూన్‌  2013: ఈ నెల 21వ తారీఖున అభిద్యేయక అభిషేకం (రెండవరోజు) పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన సుప్రభాతం మరియు అభిషేకం సేవల్లో తాత్కాలిక సమయ మార్పును తితిదే నిర్దేశించింది.

ఈ ప్రకారం ఉదయం 3.00 గంటలకు నిర్వహించే సుప్రభాతం సేవను ఉదయం 2.00 గంటలకు నిర్వహించనున్న నేపధ్యంలో ఈ సేవలో పాల్గొనే గృహస్త భక్తులు వైకుంఠం-1 నందు హాజరు కావలసిన సమయాన్ని  ఉదయం 1.00 గంటకు మార్చడమైనది. అదేవిధంగా ఉదయం 4.30 గంటలకు నిర్వహించే అభిషేక సేవను ఉదయం 3.30 గంటలకే నిర్వహించనున్న నేపధ్యంలో ఈ సేవలో పాల్గొనే గృహస్థ భక్తులు హాజరు కావలసిన సమయాన్ని ఉదయం 2.00 గంటలుగా మార్చడమైనది.
ఈ మార్పులను గమనించి భక్తులు తితిదేకు సహకరించగలరు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.