CHANGE OF VENUE AT PRAKASAM DISTRICT KALYANAMS _ ప్ర‌కాశం జిల్లాలో శ్రీ‌నివాస క‌ల్యాణాల వేదిక‌లు మార్పు

Tirupati, 18 Dec. 19: TTD has announced some alterations in locations where Srinivasa Kalyanam event that was scheduled in the month of December earlier in the Prakasam district.

On December 20, the event will be held at the ZP school of Sitaramapuram village of Hanumanthunipadu Mandal, on December 22 at the Nirmala High school premises of Kanduluru village of Tangaturu Mandal and on December 23, the divine event will be held at the Sri Ramalayam of Chakirevu colony at Kothapatnam town. 

AT KARNATAKA ON DECEMBER 28:

The auspicious event of Srinivasa Kalyanam will be performed on December 28 at Netaji grounds of Muthyalapeta in Mulbagal Mandal of Kolar District in Karnataka.

Acharya Rajagopalan, secretary of Srinivasa Kalyanam project is supervising all the arrangements.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ప్ర‌కాశం జిల్లాలో శ్రీ‌నివాస క‌ల్యాణాల వేదిక‌లు మార్పు
 
తిరుప‌తి, 18 డిసెంబ‌రు 2019: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్ర‌కాశం జిల్లాలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన శ్రీ‌నివాస క‌ల్యాణాల్లో మూడు చోట్ల వేదిక‌ల‌ను మార్చ‌డం జ‌రిగింది.

డిసెంబ‌రు 20న హ‌నుమంతునిపాడు మండ‌లంలోని సీతారామాపురం గ్రామంలో గ‌ల జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల మైదానంలో శ్రీ‌వారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. డిసెంబ‌రు 22న టంగుటూరు మండ‌లం కందులూరులోని నిర్మ‌ల ఉన్న‌త పాఠ‌శాల‌లో స్వామివారి క‌ల్యాణం జ‌రుగ‌నుంది. డిసెంబ‌రు 23న కొత్త‌ప‌ట్నంలోని చాకిరేవు కాల‌నీలో గ‌ల శ్రీ రామాల‌యంలో శ్రీ‌నివాస క‌ల్యాణం నిర్వ‌హించ‌నున్నారు.

డిసెంబ‌రు 28న క‌ర్ణాట‌క‌లో శ్రీ‌నివాస క‌ల్యాణం

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముళ్‌బాగ‌ళ్ మండ‌లం ముత్యాల‌పేట‌లోని నేతాజీ మైదానంలో డిసెంబ‌రు 28న శ్రీ‌నివాస క‌ల్యాణం నిర్వ‌హించ‌నున్నారు.
 
శ్రీ‌నివాస క‌ల్యాణం ప్రాజెక్టు కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ ఈ క‌ల్యాణాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.