CHATURMASA DEEKSHA OF TIRUMALA PONTIFFS COMMENCES

TIRUMALA, 9 July 2017: The pontiffs of Tirumala, HH Sri Periyakovil Kelviyappan Shadagopa Ramanuja Pedda Jiyangar Swamy along with his junior pontiff, HH Sri Narayana Ramanuja Chinna Jiyangar swamy commenced Chaturmasa Deeksha with utmost devotion on Sunday.

On this auspicious occasion, they were received with the traditional temple honours in Tirumala temple. TTD EO Sri Anil Kumar Singhal welcomed the seers on their arrival at Maha Dwaram. Later the holy seers duo had darshan of Lord Venkateswara. Earlier, following the temple tradition, the seers offered prayers in the temple of Sri Bhu Varahaswamy.

Afterwards the Peeda Jiyar and Chinna Jiyar swamijis were presented with pattu melchat vastram, parivattam and Bharichat vastram, parivattam respectively inside kulasekhara Alwarpadi in sanctum.

Chaturmasa Deeksha is one of the most important religious fetes followed by the saintly persons during the four months- Shravana, Bhadrapada, Aaswayuja and karteeka as per Hindu Sanatana Dharma seeking the well-being of entire humanity. The seers perform sacred deeds like Snana, Japa, Tapa, Homa etc. With utmost devotion during this period.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో శ్రీ పెద్దజీయంగార్‌ చాతుర్మాస దీక్ష సంకల్పం

జూలై 09, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం వైభవంగా జరిగింది.

ముందుగా శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. శ్రీజీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీచిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం పెద్దజీయర్‌ మఠంలో శ్రీ పెద్దజీయంగార్‌, శ్రీ చిన్నజీయంగార్‌ కలిసి టిటిడి ఈవో, సివిఎస్‌వోను శాలువతో ఘనంగా సన్మానించారు.

హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీకోదండరామారావు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్‌ శ్రీ రమేష్‌, బొక్కసం బాధ్యులు శ్రీగురురాజారావు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.