CHATURMASA DEEKSHA OF TIRUMALA SEERS COMMENCES _ తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం

TIRUMALA, 13 JULY 2022: The Chaturmasya Deeksha by HH Sri Pedda Jiyangar and HH Sri Chinna Jiyangar Swamijis of Tirumala commenced on Wednesday. 
 

Following the age-old tradition, Sri Pedda Jeeyar Swamy accompanied by Chinna Jeeyar Swamy and other disciples, offered prayers first to Sri Bhu Varaha Swamy before having darshan of Sri Venkateswara Swamy in Tirumala temple.

At the main entrance of Tirumala temple, both the seers were welcomed by TTD EO Sri A V Dharma Reddy. After offering prayers to Sri Venkateswara Swamy the senior pontiff was presented with Melchat Vastram while the junior pontiff with Noolchat Vastram as a part of “Cloth Drapery Honour” marking their Deeksha taking ceremony. 

 

Elucidating the importance of Chaturmasya Deeksha, both the seers stated that, it is an auspicious four-month Vrata period starting from the day of Ashada Pournami concluding on Kartika Shukla Pournami. The months of Shravana, Bhadrapada, Ashvayuja and Kartika fall in between this period. These four months are said to be very pleasing to Sri Maha Vishnu. The spiritual persons strongly believe that Dana, Vrata, Japa and Homa performed during this four-month period brings forth countless merits, compared to the noble deeds performed during other months in a year.

 

After taking Deeksha they went along the four-mada streets in a procession accompanied by their disciples and reached Pedda Jeeyangar Mutt. Some special pujas were performed on the occasion and later felicitated the EO with shawl and prasadams.

 

Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, AVSO Sri Surendra and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం

తిరుమల, 2022 జులై 13: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంద‌న్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ ప‌ర్వ‌దినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైందిగా భావిస్తారన్నారు.

అంతకుముందు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్టమ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

శ్రీవారి ఆలయ మహ‌ద్వారం వ‌ద్ద టిటిడి ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం శ్రీపెద్దజీయర్‌ మఠంలో శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవోను శాలువతో సన్మానించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.