CHATURMASA SANKALPAM COMMENCES IN TIRUMALA _ తిరుమలలో పెద్దజీయంగార్ చాతుర్మాస సంకల్పం ప్రారంభం
తిరుమలలో పెద్దజీయంగార్ చాతుర్మాస సంకల్పం ప్రారంభం
తిరుమల, జూలై 22, 2013: తిరుమలలో సోమవారం నాడు తిరుమల పెద్దజీయంగార్ నేతృత్వంలో చాతుర్మాస సంకల్పం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుండి చిన్నజీయంగారు మరియు శిష్య బృందంతో కలిసి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. శ్రీవారి ఆలయ మహద్వారం చెంత తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ ఇతర అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
అనంతరం శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత తితిదే పెద్దజీయంగారికి మేల్‌చాట్ వస్త్రాన్ని, చిన్న జీయంగారికి నూల్‌చాట్ వస్త్రాన్ని బహూకరించింది.
ఆచార్య పురుషులు వారి వారి సంప్రదాయాల ప్రకారం ఆషాడమాసం పౌర్ణమి నుండి భాద్రపద మాసం పౌర్ణమి వరకు చాతుర్మాస సంకల్పం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారు ఉన్న ప్రాంతాలను వీడి ఎక్కడికీ వెళ్లరు. ఈ కాలంలో నిష్టగా ఉండి నిత్యం అనుష్టానం చేస్తూ లోకకల్యాణం కోసం స్వామివారిని ప్రార్థిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.