ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు చెన్నై సమాచార కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు చెన్నై సమాచార కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2019 ఆగస్టు 16: తమిళనాడు రాష్ట్రం, చెన్నై టి.నగర్‌లోని టిటిడి సమాచార కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 17న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో బాగంగా ఆగస్టు 18వ తేదీ ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, చతుష్టార్చన, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం యాగశాల పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 19న ఉదయం హోమం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, జరుగనున్నది. ఆగస్టు 20న ఉదయం హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభరాధన, స్నపన తిరుమంజనం, సాయంత్రం పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.