CHIEF PONTIFF OF SRI RANGAM SRIMATH ANDAVAN ASHRAMAM OFFERED PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌ స్వామీజీకి పెద్దమర్యాద

Tirumala, 18 Nov. 19: His Holiness Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam visited Sri Vari Temple, Tirumala on Monday. On his arrival at infront of Sri Vari Temple TTD Executive Officer Sri Anil Kumar Singhal and Temple, Priests welcomed him with Temple Honors and led him to Sanctum Santorium.

DyEO Sri Haridranath, VGO Sri Manohar, Parpatheyadar Sri Gurappa and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌ స్వామీజీకి పెద్దమర్యాద

తిరుమల, 2019 న‌వంబరు 18: తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్ (ఆండవన్‌) స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున సోమ‌వారం ఉదయం పెద్ద మర్యాద చేశారు.

ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయం  వ‌ద్ద‌కు చేరుకున్నారు.

శ్రీవారి ఆలయం వద్ద స్వామీజీకి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్‌ శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.