CHILDREN’S DAY HELD IN BALAMANDIR _ బాల మందిరంలో ఘనంగా బాలల దినోత్సవం

Tirupati, 14 November 2022:The Children’s Day was observed with pomp and gaiety on Monday in SV Balamandir school of TTD.

DEO Sri Bhaskar Reddy who took part in the fete said the pupils should study with dedication and discipline to climb new heights in their careers.

He said the school was set up by Pandit Jawaharlal Nehru, the first prime minister of Independent India.

He also said many students who underwent education in the school, are now in plum posts across the world in various fields.

CAO Sri Sesha Sailendra, AEO Smt Ammulu, faculty, and students participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

బాల మందిరంలో ఘనంగా బాలల దినోత్సవం

తిరుపతి, 2022 నవంబరు 14 ;టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ బాల మందిరంలో సోమవారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో టిటిడి డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలబాలికలు ఏకాగ్రతతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. బాల మందిరంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు దేశ విదేశాలలో అత్యున్నత స్థాయిలో స్థిరపడినట్లు చెప్పారు. శ్రీ జవహర్ లాల్ నెహ్రూ బాల మందిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో సిఏవో శ్రీ శేషశైలేంద్ర, బాల మందిరం ఏఈవో శ్రీమతి అమ్ములు, బాల మందిరం మరియు శ్రవణం ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.