CHINNA SESHA VAHANA SEVA HELD _ చిన్నశేషవాహనంపై శ్రీ మలయప్ప చిద్విలాసం

TIRUMALA, 28 JANUARY 2023: Sri Malayappa graced on the five hooded Chinna Sesha Vahanam to bless the devotees as a part of Radhasaptami on Saturday.

Among the series of seven Vahana Sevas, Chinna Sesha Vahana seva was held in Tirumala between 9am and 10am.

Devotees who were seen in all the galleries in mada streets witnessed the vahana seva with religious ecstacy.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, and other officials wére present.                                                

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నశేషవాహనంపై శ్రీ మలయప్ప చిద్విలాసం

తిరుమల, 28 జనవరి 2023:  తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా రెండో వాహనమైన చిన్నశేష వాహనసేవ ఘనంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు (ఉదయం 9 గం||ల నుండి 10 గం||ల వరకు) :

సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు.

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు ఇత‌ర టిటిడి అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.