CHINNA SESHA VAHANA SEVA TOOK PLACE _ చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడి కటాక్షం

TIRUPATI, 21 MARCH 2023: On the second day morning of the ongoing annual brahmotsavams in Sri Kodandarama Swamy temple, Chinna Sesha Vahana seva held in Tirupati on Tuesday.

 

Sri Kodandarama Swamy  seated on the five hooded Serpent carrier to bless the devotees who converged all along the Mada streets.

 

Both the Senior and Junior Pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, VGO Sri Manohar, AEO Sri Mohan, Superintendent Sri Ramesh, Kankanabhattar Sri Anandakumara Deekshitulu, temple officials, devotees participated.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడి కటాక్షం

తిరుపతి, 2023 మార్చి 21: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.

వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు . ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజివో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, కంకణభట్టర్ శ్రీ ఆనందకుమార దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.