CHINNA SESHA VAHANAM ENTHRALLS DEVOTEES_ చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

Tirupati, 17 March 2018: The procession of Chinna Sesha Vahanam organised on the second day of the ongoing annual Brahmotsavam of Sri Kodanda Rama Swamy temple on Saturday was a feast to the eyes of thousands of devotees who had congregated around the thoroughfares of the temple town.

The processional deity of Lord Sri Kodanda Rama in all His majesty was a spectacle to the devotees.

It is widely believed that a divine glimpse of the Lord on Chinna Sesha Vahanam, who according to mythology is none other than the King serpent Vasuki, enlightens the devout about the importance of the hidden Kundalini energy within self and enables to attain 8.4 millionth manifestation which is believed to be the last in the cosmic life cycle.

Temple DyEO Smt Jhansi Rani, Archaka Sri Anankumar Deekshitulu, Temple Supdt Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other staffs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

మార్చి 17, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

కైవల్య జ్ఞానప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.

వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు విశేషషగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.