CHINNASESHA VAHANAM TAKES THE PRIVILEGE AS FIRST CARRIER OF DIVINE MOTHER_ చిన్న శేషవాహనంపై సిరులతల్లి

Tiruchanur, 15 November 2017: The five hooded serpent King, Chinna Sesha Vahanam has enjoyed the privilege of serving Universal Mother Goddess Padmavathi Devi as first carrier during the nine-day Vahana Seva as a part of the annual Brahmotsavams on Wednesday evening.

The Goddess of Riches in all Her celestial splendour carried the divine mother along the four mada streets encircling the temple.

TTD EO Sri AK Singhal, JEO Tirupati Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, Temple Spl Gr DyEO Sri Munirathnam Reddy and other temple officials, large congregation of devotees witnessed the vahana Seva with devotion.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్న శేషవాహనంపై సిరులతల్లి

తిరుపతి, 2017 నవంబరు 15: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి 8.00 నుండి 10.00 గం||ల వరకు సిరుల తల్లి శ్రీపద్మావతి అమ్మవారు చిన్నశేష వాహనంపై ఆలయ నాలుగు మాఢవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు.

శేషుడు శ్రీవైకుంఠంలో నిత్య సూర్యుడై లక్ష్మినారాయణులకు సేవలను అందిస్తున్నారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతుంది. చిన్న శేషవాహనం పైన అమ్మవారిని దర్శించుకున్న భక్తకోటికి యోగ సిద్ధి చేకూరుతుంది.

అంతకుముందు ఆలయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.