CHINNA SESHA VAHANA SEVA ON SECOND DAY _ చిన్నశేషవాహనంపై శ్రీ‌కృష్ణుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Tirupati, 3 Mar. 21: On the second day morning of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram temple, the Lord took a ride on Chinna Sesha Vahanam.

In view of Covid guidelines, the brahmotsavams are being observed in Ekantam.

DyEO Smt Shanti, AEO Sri.Dhananjayulu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నశేషవాహనంపై శ్రీ‌కృష్ణుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2021 మార్చి 03: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ‌కృష్ణుని అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో  ఏకాంతంగా జరిగింది.

రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహన సేవ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి,  ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.