CJ OF AP HC OFFERS PRAYERS TO GODDESS PADMAVATHI _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
Tiruchanoor, 24 Nov. 19: The Chief Justice of High Court of Andhra Pradesh, Justice Jitendra Kumar Maheshwari offered prayers in the temple of Goddess Padmavathi Devi at Tiruchanoor on Sunday.
TTD Chairman Sri YV Subba Reddy, JEO Sri P Basant Kumar received the dignitary while the religious staff welcomed the CJ with traditional Kumbham.
After darshan of the presiding deity he was offered prasadams.
Tirupati Urban SP Sri Gajarao Bhupal, Temple DyEO Smt Jhansi Rani and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
తిరుపతి, నవంబరు 24, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ప్రధాన న్యాయమూర్తికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు పాల్గొన్నారు.