CJ OFFERS PRAYERS IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

TIRUPATI, 02 OCTOBER 2022: The Honourable Chief Justice of India, Justice UU Lalit offered prayers in the temple of Goddess Sri Padmavathi Devi in Tiruchanoor on Sunday.

 

JEO Sri Veerabrahmam received the dignitary and the CJI was welcomed with the traditional Purnakumbham.

 

Later he had darshan along with his family. Veda Pundits offered Vedaseervachanam and he was presented with Ammavari Theertha Prasadams.

 

Deputy EO Sri Lokanatham, Agama Advisor Sri Srinivasacharyulu, Priest Sri Babu Swamy, AEO Sri Prabhakar Reddy were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి 2 అక్టోబ‌రు 2022: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ యుయు.లలిత్‌కు జేఈవో శ్రీ వీరబ్రహ్మం స్వాగతం పలికారు . ఆగమ సలహా దారు శ్రీ శ్రీనివాసాచార్యులు ,అర్చకులు శ్రీ బాబు స్వామి తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్‌ దంపతులకు వేద‌ పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు

డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం , ఎ ఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది