CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌

Tirumala, 17 Nov. 19: The Honourable Chief Justice of India, Justice Ranjan Gogoi accompanied by his wife Smt Rupanjali Gogoi on Sunday offered prayers in the Hill Shrine of Lord Venkateswara.

Chief Justice of India along with his family, he was accorded welcome on his arrival at the main entrance of the temple amidst chanting of Vedic hymns by veda pundits and melam band.

In the sanctum sanctorum he was explained about the importance of presiding deity and the jewels adorned to Lord Venkateswara. Later the Vedic scholars offered vedasirvachanam in Ranganayakula mandapam.

TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, offered theertha prasadams of lord venkateswara to the top brass dignitary.

Temple DyEO Sri Haridranath, Reception Officials Sri Balaji and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌

తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 17: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ దంప‌తులు ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌కు  టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ లోక‌నాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.