CJI REACHES TIRUMALA _ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఘన స్వాగతం
TAKES PART IN EKANTA SEVA
TIRUMALA, 10 JUNE 2021: The Honourable Chief Justice of India (CJI) Justice NV Ramana on Thursday evening arrived in Tirumala on a two-day pilgrimage along with his family members. This is his maiden visit to the Pilgrim Centre after his elevation to the coveted post.
On his arrival at Sri Padmavathi Rest House, he was welcomed by TTD Trust Board Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy.TTD Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti were also present.
Among other prominent personalities who received the dignitary included AP High Court Judge Justice Lalita Kumari and Tirupati Legislator and TTD board member Sri B Karunakar Reddy.
District Judge Sri Ravindrababu, Tirupati Additional District Judge Justice Veera Raju, Protocol Magistrate Sri Pavan Kumar, DIG Krantirana Tata, District Collector Sri Harinarayan, SP Sri Venkatappala Naidu, were also present.
Later the CJI had darshan of Sri Venkateswara Swamy along with his family and took part in Ekanta Seva.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఘన స్వాగతం
శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సి జె
తిరుమల 10 జూన్ 2021: శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ,ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం శ్రీవారి దర్శనం కోసం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు.
జస్టిస్ ఎన్వీ రమణ సతీ సమేతంగా స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీ రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి శ్రీ వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్ శ్రీ పవన్ కుమార్, డిఐజి శ్రీ క్రాంతి రాణా టాటా, సి వి ఎస్ ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్,తిరుపతి అర్బన్ ఎస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు
టీటీడీ ప్రజాసబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.