CLARIFICATION ON TTD FUNDS INVESTMENT _ టిటిడి పెట్టుబడులపై వివరణ
Tirumala, 17 October 2020: The Trust Board has explored various options of investment, in the back drop of falling interest rate scenario in the wake of COVID pandemic and considered investments in Central Government or in different Sate Government securities as one of the options to be considered.
There is no “hidden agenda” in this as the Trust Board has transparently made the decision in the Trust Board meetings telecast “Live” and further this Agenda with Board resolution was also uploaded in the TTD Website.
The investments in Central Government or State Government securities are not newly brought out by the Board but such a provision already exists in Sec 111(3) of Endowments Act 30 of 1987 and in Rule 80 of the TTD Rules issued in G.O.311, dt.09.04.1990 and such investments in securities can be made only after the guidelines are approved by the government.
No investment was made till now either in the Central Government or in different State Government securities. Board wanted to examine the investment option in Securities in the wake of falling interest rates. Now, this option may not be required to be acted upon, as the interest rates may go up, in the light of buoyance on the economy in the wake of unlock guidelines 5.0 and the TTD may continue to invest in the Fixed Deposits in banks.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి పెట్టుబడులపై వివరణ
తిరుపతి, 2020 అక్టోబరు 17: ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను టిటిడి ధర్మకర్తల మండలి లోతుగా అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలని ఒక అంశాన్ని ఐచ్ఛికంగా మాత్రమే పరిగణలోకి తీసుకుంది.
అంతేగానీ, ఇందులో ఎలాంటి రహస్య అజెండా లేదు. టిటిడి బోర్డు ఎంతో పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బోర్డు తీర్మానాన్ని టిటిడి వెబ్ సైట్ లోనూ అప్ లోడ్ చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అంశం కొత్తగా తీసుకున్నది కాదు. ఇదివరకే 1987 దేవాదాయ శాఖ చట్టం 30లోని సెక్షన్111(3), జి.ఓ 311, తేది: 09-04-1990 లోని టిటిడి నిబంధన 80 ప్రకారం ప్రభుత్వ ఆమోదం పొందిన మార్గదర్శకాల మేరకు సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో టిటిడి పెట్టుబడులు పెట్టలేదన్న విషయాన్ని స్పష్టం చేయడమైనది. అయితే వడ్డీ రేట్లు తగ్గుతున్నతరుణంలో టిటిడి బొర్డు ఈ సెక్యూరిటీల్లో పెట్టుబడులపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం ఈ ఐచ్ఛికాన్ని పరిగణించ వలసిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున ఇకపై బ్యాంకులలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడాన్ని టిటిడి కొనసాగిస్తుందని తెలియజేయడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.