CLEANSING WITH “PARAMILA DRAVYAM” PERFORMED_ శ్రీవారి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 11 July 2017: The hill shrine of Tirumala was cleansed with sacred water and mixture of aromatic ingredients known as “Parimalam” on Tuesday as a part of Koil Alwar Tirumanjanam in connection Salakatla Anivara Asthanam on July 16.

All the deities were removed from the Garbha Griha, including puja materials and cleansed thoroughly while the main deity is covered with a white veil when the temple cleansing process was underway. The temple staff took part in this religious fete and cleansed the entire premises inside and outside sanctum sanctorum, sub-temples etc. with utmost devotion.

This fete lasted for over three hours and afterwards all the deities and puja material were brought inside the temple. Then Harati and Neivedyam were rendered to the presiding deity of Lord Venkateswara, later devotees are allowed for darshan.

TTD has cancelled Astadala Pada Padmaradhana in view of this fete on Tuesday.

TTD EO Sri AK Singhal, CVSO Sri A Ravi Krishna, Temple DyEO Sri Kodanda Rama Rao and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2017 జూలై 11: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టిటిడి వేడుకగా నిర్వహించింది. ఈనెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు గంటల పాటు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

వేకువజామున స్వామివారికి సుప్రభాతం నిర్వహించిన ఆనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు పరదాతో కప్పి వేశారు. అనంతరం ఆనందనిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు, ఆలయంలోని ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ యావత్‌ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఒక మహాయజ్ఞంలా నిర్వహించారు.

ఆలయశుద్ధి చేసిన అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేయగా, ఇతర ఆర్జిత సేవలు యథాతథంగా జరిగాయి.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, విజీవో శ్రీ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.