CM TAKES PART IN UNJAL SEVA_ ఊంజలసేవలో శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

Vijayawada, 8 July 2017: Honourable CM of Andhra Pradesh Sri N Chandrababu Naidu along with union minister Sri M Venkaiah Naidu and AP Minister Sri K Srinivasa Rao took part in Unjal Seva of Lord as a part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams in PWD Grounds of Vijayawada on Saturdayevening.

Earlier, on his arrival, he was welcomed by TTD EO Sri Anil Kumar Singhal and Tirupati JEO Sri P Bhaskar. Later the delegates had Darshan of Lord Venkateswara.

The Mantralaya Raghavendra Swamy Mutt seer, HH Sri Suyateendrateertha Swamy who also graced the occasion, in his anugrahabhashanam complimented the TTD and philanthropists who made elaborate arrangements for the religious event.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఊంజలసేవలో శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు

విజయవాడ, 2017 జూలై 08: విజయవాడ పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం శ్రీవారి ఊంజలసేవలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా

చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రివర్యులు గౌ|| శ్రీ వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు శ్రీకామినేని శ్రీనివాస్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో

శ్రీ పోల భాస్కర్‌ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనం అందించారు.

భక్తులను విశేషంగా అలరించిన శ్రీ వాసూరావు అన్నమయ్య సంకీర్తనాలాపన ఇందులో భాగంగా ప్రముఖ సంగీత గాయకులు శ్రీ వాసురావు బృందం అన్నమయ్య సంకీర్తన గానం భక్తులను తన్మయులను చేసింది.

సహస్రదీపాలంకరణసేవ(ఊంజలసేవ) సందర్భంగా శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. ఇందులో ” అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల

పడగలమయము….మద్య్రమావతి రాగం, బ్రహ్మ కడిగిన పాదము….ముఖారి రాగం, జగడపు జనవుల జాతర సగిసల మంచపు జాతర….హిందోళవసంత రాగం, పొడగంటిమయ్య నిన్ను

పురుషోత్తమా….మోహన రాగం, బ్రహ్మ మొక్కటె పరబ్రహ్మ మొకటే….భౌళి రాగం, గోవిందాశ్రిత గోకులబృందా పావన జయజయ పరమానందా….బహుదారి రాగంలో గానం చేశారు.

కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు….హిందోళ రాగం, నారాయణతే నమోనమో నారద సన్నుత నమోనమో….బేహాగ్‌ రాగం, ముద్దుగారే యశోద ముంగిట ముతైము వీడు….కురంజి

రాగం”లో అలపించిన కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.