CM OFFERS SILK VASTRAMS_ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు

Tirumala, 23 September 2017: The honourable CM of Andhra Pradesh, Sri N Chandrababu Naidu offered silk vastrams to Lord Venkateswara in Tirumala temple on behalf of State Government. It is a usual practice to offer the presentation to the Universal Lord by Head of the State on the first day of annual brahmotsavams of Tirumala.

Earlier, according to temple tradition at Sri Bedi Anjaneyulu Swamy temple, the CM carried the traditional “Sare” over his head and entered Srivari temple through Mahadwaram amidst the chanting of vedic hymns by temple priests and vedic scholars.

Later the CM and his entourage offered prayers in the temple of Lord Venkateswara followed by Vedasirvachanam at Ranganayakula Mandapam. Later he was presented with Sesha Vastram, Teertha Prasadams and lamination photo of Lord Venakteswara.

Ministers Sri Amarnath Reddy, Sri Manekayala Rao, TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, DIG Sri Prabhakara Rao, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh and others took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు

సెప్టెంబర్‌ 23, తిరుమల 2017: శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలలో తొలిరోజైన శనివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్రాలు సమర్పించి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు గౌ|| ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీఆకె.రవికృష్ణ కలిసి స్వాగతం పలికారు. గౌ|| ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

పవిత్రమైన, పరిశుభ్రమైన క్షేత్రం తిరుమల : గౌ|| ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ అతిపవిత్రమైన, పరిశుభ్రమైన క్షేత్రం తిరుమల అని, శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో తిరుపతిని స్మార్ట్‌సిటిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటివరకు 11 సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే మహాభాగ్యం కలిగిందని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మూడు అంశాలతో మహాసంకల్పం చేసుకున్నానని, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌గా రూపొందించాలని, తాగునీటి, సాగునీటికి, పరిశ్రమలకు కొరత లేకుండా నీటి సంరక్షణ చేపట్టాలని, విద్యుత్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రి తెలిపారు. ఆనంతరం శ్రీవారి పెద్ద శేషవాహన సేవలో గౌ|| ముఖ్యమంత్రి దంపతులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు, శ్రీ అమరనాథరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీమతి సుగుణమ్మ ఇతర ఆధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.