CMO VEHICLE NOT ENTERED MADA STREETS-TTD _ సిఎంఓ స్టిక్కరు గల వాహనం మాడ వీధుల్లోకి ప్రవేశించలేదు
TIRUMALA, 31 JANUARY 2023: The news that a four-wheeler with a sticker of CMO, entered the Tirumala temple mada streets against the TTD norms by a section of electronic media on Tuesday was completely baseless.
TTD has restricted the entry of VIP Protocol vehicles only up to the Security Gate of Vahana Mandapam. However, for the sake of aged, and physically challenged, TTD operates battery vehicles, which carry them up to Bio-metric entrance point. On Tuesday also, the toll gate at the Security Post was opened for the Battery vehicle. Near this post, usually TTD keeps an Ambulance for emergency purposes. At this point alone, the alleged vehicle did a turn but has not entered the mada streets as projected in the news channel.
But the media channel projected the news that due to Security lapse, the four-wheeler has deviated the norms which is absolutely ruthless. The devotees are requested not to believe in such false and baseless news.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సిఎంఓ స్టిక్కరు గల వాహనం మాడ వీధుల్లోకి ప్రవేశించలేదు
– టిటిడి వివరణ
తిరుమల, 31 జనవరి 2023: సిఎంఓ స్టిక్కరు గల ఒక వాహనం శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి ప్రవేశించిందని మంగళవారం కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వాస్తవం కాదు.
ఆలయ మాఢ వీధుల్లోకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను టిటిడి నిషేధించింది. ప్రముఖుల వాహనాలను వాహనమండపం పక్కన గల సెక్యూరిటీ గేటు వద్దకు మాత్రమే అనుమతిస్తారు. అయితే శ్రీవారి ఆలయం నుండి రాంభగీచా గేటు వద్దకు వృద్ధులు, దివ్యాంగులను తీసుకెళ్లే బ్యాటరీ వాహనం కోసం ఈ సెక్యూరిటీ గేటును తీసి ఉంచారు. ఈ గేటు పక్కనే దాతల ద్వారా అందే వాహనాలను, అంబులెన్సును ఉంచుతారు. సదరు వార్తలో పేర్కొన్న ఈ వాహనాన్ని ఇక్కడే పక్కకు తిప్పుకున్నారు. అంతేగానీ మాడవీధుల్లోకి ఈ వాహనం ప్రవేశించలేదు.
టిటిడి అధికారుల భద్రతా వైఫల్యం వల్లే మాడవీధుల్లోకి ఈ వాహనం ప్రవేశించిందని సదరు వార్తలో పేర్కొనడం బాధాకరం. భక్తులు ఇలాంటి వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేయడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.