COMPLETE COTTAGE REPAIRS BEFORE THE ANNUAL BRAHMOTSAVAMS- TTD EO _ బ్రహ్మోత్సవాల్లోపు తిరుమలలోని కాటేజిలన్నీ అందుబాటులోకి తీసుకురావాలి – టిటిడి ఈవో
Tirumala, 4 February 2021: All the repair works of cottages should be completed before this year annual Brahmotsavams instructed TTD EO Dr KS Jawahar Reddy.
During the review meeting with senior officers in the TTD Administrative building on Thursday morning the EO directed engineering officials that all repair works should be completed in a phased manner before Srivari Brahmotsavams and also the new Parakamani building.
He asked the officials concerned to make all arrangements for the release of TTD publications during the Rathasapthami fete.
EO instructed the concerned to complete digitisation of records of TTD employees SRs, leave registers, etc. on a war footing.
He directed the officials to prepare long term plans to meet the parking requirements at Tirumala in view of ever-increasing vehicular traffic.
On promoting greenery, he also asked officials concerned to focus on increasing avenues of gardening.
Additional EO Sri AV Dharma Reddy briefed on the ongoing works to record and provide voice for rare and remaining Annamacharya Sankeetans.
In the end the TTD EO also reviewed the arrangements for conducting festivals in local and TTD temples in other regions.
CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, FA & CAO Sri O Balaji and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లోపు తిరుమలలోని కాటేజిలన్నీ అందుబాటులోకి తీసుకురావాలి – టిటిడి ఈవో
తిరుపతి, 2021 ఫిబ్రవరి 04: తిరుమలలో మరమత్తులకు గురైన కాటేజిల పనులను శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలో గురువారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో వివిధ కాటేజిల మరమత్తుల పనులు జరుగుతున్నాయని, దశల వారీగా ప్రారంభమైన ఈ పనులన్నీ బ్రహ్మోత్సవాల నాటికి అన్ని సదుపాయాలతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రథసప్తమి సందర్భంగా ఆధ్యాత్మిక పుస్తకాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఎస్ ఆర్‌లు, సెలవులు, ఇంక్రిమెంట్లు లాంటి సమస్త సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలన్నారు.
తిరుమలలో నిర్మాణంలో ఉన్న పరకామణి భవనాన్ని బ్రహ్మోత్సవాలలోపు పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. తిరుమలకు రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్నందువల్ల పార్కింగ్ సమస్యను అధిగమించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తిరుమలలో పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించడానికి విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచేందుకు జరుగుతున్న పనుల గురించి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఈవోకు వివరించారు. స్థానిక ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని టిటిడి ఆలయాల్లో జరిగే ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.
సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎఫ్ ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.