COMPLETE GHAT ROAD AND SRIVARIMETTU RESTORATION WORKS ON A FAST PACE-TTD EO _ ఘాట్ రోడ్డు, శ్రీ‌వారిమెట్టు మార్గాల మ‌రమ్మ‌తులు త్వ‌ర‌లో పూర్తి చేయాలి – టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

REGULATION OF SPEEDING VEHICLES IN GHAT ROADS

 

 

TIRUMALA, 26 DECEMBER 2021: The restoration of ghat roads and Srivari Mettu works should be completed on a fast pace to avoid traffic woes of pilgrims said TTD EO Dr KS Jawahar Reddy.

 

 

During a review meeting through virtual means on Saturday, directed the officials concerned to use speed guns and speed breakers to control speeding vehicles and also impose fines on the violators.

 

 

He also said the geological and topography survey reports by Gurgaon based Bhumi Developers done through drone should be submitted before January 10. These reports should be sent to the experts of Amrita University for their advice.

 

 

He later reviewed with the Engineering Officials over extensive of first ghat road into four lanes from Mokalimettu to GNC toll gate and also on Annamaiah Margam development.

 

 

JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, experts from Bhumi Developers were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

 

ఘాట్ రోడ్ల‌లో వాహ‌నాల వేగ‌నియంత్ర‌ణ చ‌ర్య‌లు

– ఘాట్ రోడ్డు, శ్రీ‌వారిమెట్టు మార్గాల మ‌రమ్మ‌తులు త్వ‌ర‌లో పూర్తి చేయాలి

– టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమల, 2021 డిసెంబ‌రు 25: తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాల నివార‌ణ కోసం వాహ‌నాల వేగ‌నియంత్ర‌ణ కోసం స్పీడ్ గ‌న్‌లు, స్పీడ్ బ్రేక‌ర్లు ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నిర్ణీత వేగం నిబంధ‌న‌ను ఉల్లంఘించే వాహ‌నాల‌ను స్పీడ్ గ‌న్‌ల ద్వారా గుర్తించి జ‌రిమానాలు విధించాల‌న్నారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో శ‌నివారం అధికారుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న తిరుమ‌ల రెండో ఘాట్ రోడ్డు, శ్రీ‌వారి మెట్టు మ‌ర‌మ్మతు ప‌నుల‌ను త్వ‌ర‌లో పూర్తి చేయాల‌న్నారు. ఘాట్ రోడ్ల‌లో డ్రోన్ల ద్వారా గుర్గావ్‌కు చెందిన భూమి డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ నిర్వ‌హించిన జియ‌లాజిక‌ల్ స‌ర్వే, టోపోగ్ర‌ఫి స‌ర్వే నివేదిక‌ల‌ను జ‌న‌వ‌రి 10వ తేదీలోగా అందించాల‌న్నారు. ఈ నివేదిక‌ల‌ను అమృత యూనివ‌ర్సిటీలోని నిపుణుల‌కు పంపి వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. మోకాలిమెట్టు నుంచి జిఎన్‌సి వ‌ర‌కు ఒక‌టో ఘాట్ రోడ్డు నాలుగు లైన్లుగా విస్త‌రించే ప‌నుల‌కు సంబంధించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అన్న‌మ‌య్య మార్గం అభివృద్ధిపై ఈవో అధికారుల‌తో చ‌ర్చించారు.

ఈ స‌మావేశంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఏ సీఎవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, భూమి డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.