COMPLETE SSD WORKS IN TIME-EO_ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను వేగవంతంగా పూర్తి చేయాలి :టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Tirupati, 22 January 2018: The works pertaining to Slotted Sarva Darshan counters should complete on a fast pace in Tirupati and Tirumala, said, TTD EO Sri Anil Kumar Singhal.

Senior officers meeting was held in the TTD administrative building in Tirupati on Monday. Speaking on this occasion, he said, the SSD will commence from second week of March. “Analyse the pilgrim rush during peak days at Railway Station and Bus station and issue the tokens in the counters located in these places as it will be a lot of help for them”, he added.

The EO also reviewed the working of FMS call centre and instructed the concerned to sort out the issues without delay. “The vigilance wing should set up the DFMD, scanners, CC cameras, Video Walls by February end to enhance security set up. The engineering officials should set up information boards in various languages for the sake of pilgrims. Wiring should be revived inside Srivari temple to give an enhanced look to temple”, he added.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, FACAO Sri O Balaji and other senior officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను వేగవంతంగా పూర్తి చేయాలి :టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 జనవరి 22: తిరుమల, తిరుపతిలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను వేగవంతంగా పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశమందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మార్చి రెండో వారం నుంచి సర్వదర్శనం భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం కల్పించనున్న నేపథ్యంలో భక్తులకు త్వరితగతిన టోకెన్లు జారీ చేసేలా కౌంటర్లలో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ బస్టాండు ప్రాంతాల్లో ఏ సమయాల్లో భక్తుల రద్దీ ఉంటుందో ముందుగా గమనించి, అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో టోకెన్‌ జారీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుమలలో ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులను వెంటనే సంబంధిత విభాగాల ద్వారా పరిష్కరిస్తున్నామని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇకపై 24 గంటలు ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కాల్‌సెంటర్‌కు భక్తులు చేసిన సూచనలు, ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఈవో సూచించారు. డిఎఫ్‌ఎండి, స్కానర్లు, సిసి కెమెరాలు, వీడియోవాల్స్‌ తదితర భద్రతా పరికరాలను సమకూర్చుకునే ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేయాలని సివిఎస్‌వోను కోరారు. తిరుమలలో వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా ఒకేరీతిలో వివిధ భాషల్లో సూచికబోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో విద్యుత్‌ వైర్లు బయటకు కనిపించకుండా మార్చి చివరి నాటికి చక్కటి వైరింగ్‌ను పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.