“COMPLETE THE WORKS OF SARVA DARSHAN COMPLEX BEFORE ANNUAL BRAHMOTSAVAMS” – TTD EO

Tirupati, 19 June 2017: The works of Sarva Darshanam Complex should be completed before annual brahmotsavams this year, directed TTD EO Sri Anil Kumar Singhal to the engineering officials.

The review meeting took place in the meeting hall in TTD administrative building in Tirupati on Monday evening. The EO reviewed various developmental activities with respect to various departments in TTD along with JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar. He instructed the CE Sri Chandra Sekhar Reddy to complete the construction of Sarva Darshan Complex on the lines of Divya Darshan and Seeghra Darshan complexes in Tirumala before annual brahmotsavams for the sake of pilgrims.

ENTRY POINTS TO GALLERIES

To make convenient entry of pilgrims into compartments, the EO instructed the engineering officials to identify such points now itself so that there will not be any problem during brahmotsavams. “More exhaust and fans need to be arranged in VQC compartments. The signage boards should be legible for the pilgrims from RTC bus stand to temple. More water points should be placed in Srivari Mettu route. The officials should think of increasing solar power usage in Tirumala and Tirupati”, he added.

PROVIDE SPIRITUAL AMBIANCE

“The LED lighting works should be arranged in Tirumala. More sophisticated lighting arrangements should be made to Tirumala temple to give an enhanced spiritual ambiance to the hill temple”, EO opined.

LIST OUT ANCIENT TEMPLES OF LORD VENKATESWARA IN ALL DISTRICTS OF AP

The EO also instructed the officials concerned to list out ancient temples of Lord Venkateswara located in all the districts of Andhra Pradesh and chalk out a plan to bring back their past glory under TTD’s SV Heritage Preservation Trust.

BEAUTIFICATION OF TTD ROADS IN TIRUPATI

To enhance the look of temple city of Tirupati, the EO directed the engineering officials to go for beautification of major junctions. “Develop medians and green scapes to give aesthetic experience to denizens as well visitors. Go for pruning of trees for better greenery”, EO added.

Additional FACAO Sri Balaji, Additional CVSO Sri Siva Kumar Reddy, Special Gr DyEO Sri Munirathnam Reddy, were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం కాంప్లెక్స్‌ పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం భక్తులకోసం కాంప్లెక్స్‌ను పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం సాయంత్రం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి వెళ్లేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. గ్యాలరీలలో మరుగుదొడ్ల సంఖ్యను పెంచాలన్నారు. భక్తులు సులువుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు, అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ఆలయంలో విద్యుత్‌ వైరింగ్‌ను తనిఖీ చేయాలని, ఆలయం, పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా లైటింగ్‌ రూపొందించాలని సూచించారు. పూర్తికాని చోట ఎల్‌ఈడి లైట్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి శ్రీవారి ఆలయం వరకు భక్తులు సులభంగా గుర్తించేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఆయా సంస్థలతో చర్చించాలని సీఈ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. మరింత సౌరవిద్యుత్‌ను పెంచేందుకుగాను తిరుమల, తిరుపతిలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.

రాష్ట్రంలో అతిపురాతన ఆలయాల జాబితాను రూపొందించి టిటిడి శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయ వారసత్వ పరిరక్షణ ట్రస్ట్‌ ద్వారా వాటికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఈవో సూచించారు. టిటిడికి నగదు, వస్తు రూపంలో విరాళాలు అందించే దాతలకు సౌకర్యాల కల్పనపై విధివిధానాలను రూపొందించాలన్నారు. తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో గల రోడ్లలో, ప్రముఖ కూడళ్లలో పచ్చదనం పెంచి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. శ్రీవారిమెట్టు నడక మార్గంలో భక్తులకోసం తాగునీటి వసతిని పెంచాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జేఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, అదనపు సీవిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి, సీఈ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.