Conduct of MAHASAMPROKSHANAM in Sri Govindaraja Swamy Temple _ శ్రీగోవిందరాజస్వామివారి ఉప ఆలయాలలో భక్తి శ్రద్దలతో మహాసంప్రోక్షణ
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీగోవిందరాజస్వామివారి ఉప ఆలయాలలో భక్తి శ్రద్దలతో మహాసంప్రోక్షణ
తిరుపతి, మార్చి-21, 2009: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలోని ఉపఆలయాలైన శ్రీరుక్మిణీ, సత్యభామ సమేత పార్థసారధిస్వామివారి ఆలయం, శ్రీఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీవరదరాజస్వామి వారి ఆలయం, శ్రీపుండరీకవల్లి అమ్మవారి ఆలయం, శ్రీవ్యాసాంజనేయస్వామివసహసహకహల&
ఈ సందర్భంగా ఆలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది, బింబశుద్ధి చేశారు. ఇందులో భాగంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9.10గంటల మద్య హోమగుండాల వద్ద విశేషమంత్రాలతో హోమం జరిగింది. పిదప పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపి, కలశములను ఆయా ఆలయాలకు వృషభలగ్నమందు ఆయా దేవతామూర్తుల శక్తులను ఆవాహన చేశారు. తర్వాత విశేష ఆరాధన, బ్రహ్మఘోష, లోక క్షేమానికై ప్రార్థనలు జరిపి ఉదయం 11.45 గంటలకు సర్వదర్శనానికై భక్తులను అనుమతించారు.
ఈ కార్యక్రమంలో తితిదే జె.ఇ.ఓ శ్రీవి.శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఇ.ఓ శ్రీవాసుదేవన్, స్థానికాలయాల ఆగమ సలహాదారు శ్రీవేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.