CONSTRUCTION OF SV TEMPLES UPON AP CM’s DIRECTIVES _ ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు వెనుకబడిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం 

KALYANA MANDAPAM FOR FREE

MULLING TEMPLE IN KURUPAM-TTD CHAIRMAN 

MAHA SAMPROKSHANAM HELD IN SEETAMPETA

SEETAMPETA., 04 MAY 2023: Upon the directives of the Honourable CM of AP Sri YS Jaganmoham Reddy, the construction of Srivari temples has been taken up in a big way by TTD, as a part of its mission of the propagation of Sanatana Hindu Dharma, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

The TTD board chief who took part in the Maha Samprokshanam ritual of Srivari temple at Seetampeta in Manyam district on Thursday, speaking to the media on the occasion said, in the last three years construction of over 2000 temples have been taken up especially in the backward and agency areas by TTD.

The Seetampeta temple was constructed at Rs.10cr. From 17-22 the Maha Samprokshanam of Srivari temple in Rampachodavaram is scheduled. We are contemplating constructing a temple at the Agency area of Kurupam. Those who could not visit Tirumala can have darshan of Srivaru at their home places now”, he added.

The Chairman also said from the past two years, TTD is also providing darshan to the people from backward places during annual brahmotsavams and vaikuntha dwara darshan. “I wish more srivari sevaks should register from Seetampeta and render services to devotees”, he maintained.

MAHA SAMPROKSHANAM

The Maha Samprokshanam was held in the auspicious Vrishabha Lagnam between 7:30am and 8:30am and devotees are allowed for darshan from 10am onwards.

The special devotoonal programs arranged during the occasion allured tue devotees.

MP Sri Chandra Sekhar, JEO Sri Veerabrahmam, MLC Sri Vikrant, MLAs Smt Kalavati, Smt Pushpa Srivani, Smt Reddishanti, Sri Jogulu, Sri Chinna Appalanaidu, board member of TTD Sri Krishna Rao, TTD officials, archakas, temple staff were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు వెనుకబడిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం

– సీతంపేట శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ప్రారంభం

– శుభకార్యాల కోసం గిరిజనులకు ఉచితంగా కల్యాణ మండపం

– కురుపాంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చర్యలు

– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

– సీతంపేటలో ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

సీతంపేట, 2023, మే 04: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, దళితవాడలు ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకోలేని భక్తుల కోసం గడిచిన నాలుగేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో సుమారు 2 వేల ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సీతంపేటలో ఒకటిన్నర సంవత్సరాల అతి తక్కువ వ్యవధిలో దాదాపు రూ.10 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఆలయం వద్ద నిర్మించిన కల్యాణ మండపాన్ని మరింతగా విస్తరించి, చుట్టుపక్కల గిరిజన భక్తులు ఉచితంగా శుభకార్యాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు నూతన ఆలయం మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతమైన కురుపాంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

గిరిజనులకు రవాణా, వసతి, ఆహారం ఉచితంగా కల్పించి తిరుమల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనం ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల నుంచి స్వామివారి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో వేలాది మంది శ్రీవారి సేవకులు తిరుమలకు విచ్చేసి తోటి భక్తులకు సేవ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. వీరందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల నుండి మరింతమంది శ్రీవారి సేవకులుగా భక్తులకు సేవలు అందించాలని కోరారు.

ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత కుంభ ప్రదక్షిణ చేశారు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య వృషభ లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన చేపట్టారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు.

భక్తులకు దర్శనం ప్రారంభం

మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. సీతంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

శ్రీవారి సేవకుల విశేష సేవలు

సీతంపేట ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, ఆలయానికి అవసరమైన పూలు కట్టడం తదితర సేవలు అందించారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ చంద్రశేఖర్, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎమ్మెల్సీ శ్రీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు శ్రీమతి వి.కళావతి, శ్రీమతి పుష్పశ్రీవాణి, శ్రీమతి రెడ్డిశాంతి, శ్రీ కంబాల జోగులు, శ్రీ చిన్న అప్పలనాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మల్లాది కృష్ణారావు, ఐటీడీఏ పీవో కుమారి కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ శ్రీ నూరుల్ కోమర్, జిసిసి ఎండి శ్రీ సురేష్ కుమార్, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, టిటిడి వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, కంకణభట్టార్ శ్రీ శేషాచార్యులు, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇలు శ్రీ టివి.సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, విజివో శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, ఇఇ శ్రీ సుధాకర్, ఏఈఓ శ్రీ రమేష్, డెప్యూటీ ఇఇలు శ్రీ ఆనందరావు, శ్రీ నాగరాజు, జెఈ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న భజన, కోలాట కార్యక్రమాలు

సీతంపేటలోని ఆలయం వద్ద గల వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల నుంచి భజన బృందాలు కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. వైజాగ్ కు చెందిన కిరణ్మయి బృందం చక్కగా భరతనాట్య ప్రదర్శన చేశారు. అదేవిధంగా బొబ్బిలికి చెందిన శ్రీ వేంకటేశ్వర కోలాట నృత్య భజన బృందం, కొత్తూరుకు చెందిన శ్రీహరే శ్రీనివాసా కోలాట నృత్య బృందం, నరసన్నపేటకు చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట నృత్య భజన బృందం, పార్వతీపురానికి చెందిన శ్రీ పాద కోలాట నృత్య భజన బృందం కోలాట ప్రదర్శన చేశారు. సూపరింటెండెంట్ శ్రీ చంద్రమౌళీశ్వర శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి లలితామణి ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.