COUNTERS MANAGEMENT TO GO IN A PROFESSIONAL WAY _ శ్రీవారి భక్తులకు మరింత పారదర్శక సేవలు – అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
Tirumala, 1 Jul. 21: To offer more transparent services to visiting pilgrims, TTD has mulled Counters which have pilgrim interface to be operated in a more professional way.
Opening gates for this new Counters Management System at Laddu Counters in Tirumala on Thursday, TTD Additional EO Sri AV Dharma Reddy said TTD called for tenders towards the supply of manpower for the operation of counters in a professional way. KVM Info from Bengaluru has come forward quoting the lowest price.
Henceforth all the counters 164 counters which have the pilgrim interface in Tirumala including Laddu, VQC Scanning, SED counters and also SSD counters at Tirupati and Alipiri Toll Gate will also be operated by this agency. A manpower of 430 to run all these counters in three shifts are required.
These personnel are being imparted training for a week to work in all counters. Their wages will be as per Government Minimum Wages norms along with EPF and ESI benefits. They will be allotted duties at all counters on a rotation basis to avoid self motives.
To start with, the operations in Laddu Counters are commenced from today onwards. The entire operations will be under strict vigil to avoid any sort of mis- appropriation and inconvenience to pilgrims, he added.
Earlier the Additional EO also verified the distribution process in the laddu counters.
Temple DyEO Sri Harindranath, Potu AEO Sri Srinivasulu, VGO Sri Bali Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి భక్తులకు మరింత పారదర్శక సేవలు – అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2021 జూలై 01: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత పారదర్శక సేవలు అందించేందుకు టిటిడి కౌంటర్లను మరింత నైపుణ్యంతో నిర్వహించనున్నట్లు అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకుగాను వృత్తి నిపుణత కలిగిన ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా గురువారంనాడు తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో ఆయన పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో లడ్డూ కౌంటర్లలో సేవలను ప్రారంభించారు.
అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడిలో భక్తులకు విశేష సేవలందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా, వృత్తి నిపుణతతో నిర్వహించే ఏజెన్సీలను అహ్వానించామన్నారు. ఇందులో బెంగుళూరుకు చెందిన కెవిఎం ఎన్‌ఫో అతి తక్కువ ధరకు టెండరు వేసిందన్నారు. ఇకపై తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, కల్యాణ కట్ట తలనీలాలు సమర్పిచే భక్తులకు టోకెన్లు ఇచ్చే కౌంటర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో దర్శనం టికెట్లు స్కానింగ్ కౌంటర్లు, తిరుపతిలోని ఎస్‌ఎస్‌డి కౌంటర్లు, అలిపిరి టోల్‌గేట్ వద్ద ఉన్న కౌంటర్లు ఈ ఏజెన్సీ చేత నిర్వహించబడతాయన్నారు.
తిరుమల, తిరుపతిలలో యాత్రికులకు సేవలందించే 164 కౌంటర్లలో మూడు షిఫ్టులలో నడపడానికి 430 మంది సిబ్బంది అవసరమని చెప్పారు. కౌంటర్లలో విధులు నిర్వహించే సిబ్బందికి ఒక వారం పాటు శిక్షణ ఇచ్చామన్నారు. వారి వేతనాలు ప్రభుత్వ కనీస వేతన నిబంధనల ప్రకారం ఉంటాయని, ఇపిఎఫ్, ఇఎస్ఐ ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. కౌంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రోటేషన్ పద్ధతిలో వారం వారం ఈ సిబ్బందిని మార్చనున్నట్లు వివరించారు.
అనంతరం ఆయన లడ్డూ కౌంటర్లలో లడ్డూల పంపీణిని పరిశీలించారు. అనంతరం బూంది పోటును పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.