COVID GUIDELINES MUST FOR SRIVARI DARSHAN, SAYS TTD CHAIRMAN _ శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలి : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

– COVID VACCINATION FOR ALL TTD EMPLOYEES IN 2 WEEKS

– ORGANIC PRODUCTS FOR SRIVARI NAIVEDYAM ON EXPERIMENTAL BASIS

 Tirumala, 30 April 2021: TTD chairman Sri YV Subba Reddy reiterated on Friday that Covid guidelines were mandatory to all devotees coming for Srivari Darshan.

Reviewing all arrangements in view of Covid spike at the Annamaiah Bhavan with officials, TTD Chairman appealed to devotees with cold, cough and fever to postpone their Tirumala pilgrimage. The TTD had provided an option to utilise their online bookings till the end of 2021, he assured.

Speaking to media persons later he said TTD had released daily only 15,000 online Rs.300 special Darshan tickets for the month of May, but the bookings had shown a downswing.

VACCINATION TO ALL TTD EMPLOYEES IN 2 WEEKS

The TTD chairman directed officials to make arrangements for Covid vaccination of all TTD employees working both at Tirumala and Tirupati in in the coming 15 days. 

He also TTD would provide all succour to families of 15 employees who had died due to Covid and expressed his condolences to bereaved families.

He also directed officials to organise payments of Covid treatment of TTD employees in private hospitals .

He said presently TTD is facilitating employees of Tirumala to attend office on a 50:50 ratio and same formula would be followed in attendance for employees of Tirupati as well.

He said officials have been directed to organise special buses to ferry TTD employees to Tirumala and also special beds with oxygen and ventilator at BIRRD hospital for employees.

USE OF ORGANIC PRODUCTS FOR SRIVARI NAIVEDYAM

The Chairman said as done by ancestors in the past, from May 1, Saturday, on experimental basis TTD is using organic farm products for preparing Srivari naivedyam, in cooperation with Sri Vijayram, a farmer from Pinagudurulanka village of Krishna district.

He said action plan is being chalked out to use organic farm products in preparation of Srivari laddu and vada Prasadam in the second phase and thereafter in the Anna Prasadam of devotees at Sri Tarigonda Vengamamba Anna Prasadam Bhavan in the third phase.

TTD has plans to make farmers of Telugu states as partners in the divine venture by giving them special training in growing organic products without use of pesticides and fertilisers. TTD also mulls to take up organic farming in the agricultural lands donated by devotees.

INSPECTION OF DEVOTEES QUEQUE LINES ON COVID GUIDELINES

After the review session at Annamaiah Bhavan the TTD Chairman inspected then Covid guidelines arrangements at special Darshan ticket entry complex in Vaikunta Queue Complex of Srivari Temple – soap liquid, hand sanitisers, scanning point, ozone sanitizers at Mahadwaram and social distancing in the queue lines.

The TTD chairman made several suggestions to officials on streamlining of queue lines at Padi kavali onwards.

TTD Additional EO Sri AV Dharma Reddy, TTD board members Sri Sekhar Reddy, Sri Shivkumar, Sri Muralikrishna, and DyEO Sri Harindranath, Health officer Dr RR Reddy, SE-2 Sri Nageswara Rao and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలి :

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

– 2 వారాల్లో ఉద్యోగులంద‌రికీ వ్యాక్సిన్

– ప్ర‌యోగాత్మ‌కంగా శ్రీ‌వారికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో నైవేద్యం

ఏప్రిల్ 30, తిరుమల 2021: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు తోటి భ‌క్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచించిన విధంగా కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి కోరారు. కోవిడ్ నేప‌థ్యంలో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం అధికారుల‌తో ఛైర్మ‌న్ స‌మీక్షించారు.

అనంత‌రం వారిని క‌లిసిన మీడియా ప్ర‌తినిధులతో ఛైర్మ‌న్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకుని ద‌ర్శ‌నానికి వ‌స్తున్న వారి సంఖ్య బాగా త‌గ్గింద‌న్నారు. మే నెల‌లో రోజుకు 15 వేల చొప్పున ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశామ‌ని, చాలా త‌క్కువ మంది మాత్ర‌మే బుక్ చేసుకున్నార‌ని చెప్పారు. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు తిరుమ‌ల యాత్ర‌ను వాయిదా వేసుకోవాల‌ని కోరారు. ద‌ర్శ‌న టికెట్లు ర‌ద్దు చేసుకునే వారు ఈ ఏడాది ఆఖ‌రు వ‌ర‌కు తిరిగి ద‌ర్శ‌నం పొందే అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు.

2 వారాల్లో ఉద్యోగులంద‌రికీ వ్యాక్సిన్

రానున్న 2 వారాల్లో టిటిడి ఉద్యోగులంద‌రికీ వ్యాక్సిన్ వేయించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఛైర్మ‌న్ ఆదేశించారు. క‌రోనా రెండో విడ‌త‌లో ఇప్ప‌టివ‌ర‌కు 15 మంది ఉద్యోగులు కోవిడ్‌తో మృతి చెందార‌ని, వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని చెప్పారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌న్నారు. క‌రోనా వ్యాధితో ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగుల‌కు అయ్యే వైద్యఖ‌ర్చులు చెల్లించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించిన‌ట్టు చెప్పారు. తిరుమ‌ల‌లో ఇప్ప‌టికే 50ః50 నిష్ప‌త్తిలో ఉద్యోగుల‌ను విధుల‌కు అనుమ‌తిస్తున్నామ‌ని, తిరుప‌తిలోనూ ఇదే విధానాన్ని పాటించాల‌ని అధికారుల‌కు సూచించామ‌ని తెలిపారు. టిటిడి ఉద్యోగుల కోసం ప్ర‌త్యేకంగా బ‌ర్డ్ ఆసుప‌త్రిలో బెడ్లు ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. తిరుమ‌ల‌లో విధుల‌కు హాజ‌ర‌య్యే ఉద్యోగుల‌కు ఒత్తిడి లేకుండా ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు తెలిపారు.

ప్ర‌యోగాత్మ‌కంగా శ్రీ‌వారికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో నైవేద్యం

పూర్వ‌పు రోజుల త‌ర‌హాలో తిరుమ‌ల శ్రీ‌వారికి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన బియ్యం ఇత‌ర ఉత్ప‌త్తుల‌తో నైవేద్యం పెట్ట‌డాన్ని శ‌నివారం నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభిస్తామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ స‌హ‌కారంతో ఈ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తామ‌న్నారు. మొద‌టి ద‌శ‌లో శ్రీ‌వారి నైవేద్యానికి ఉప‌యోగించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీ, రెండో ద‌శ‌లో శ్రీ‌వారి ల‌డ్డూ, వ‌డ ప్ర‌సాదాల త‌యారీ, మూడో ద‌శ‌లో వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీ చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌న్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని రైతులను భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా దేశీయ బియ్యం ర‌కాల‌ను పండించ‌డంలో శిక్ష‌ణ ఇస్తామ‌ని తెలిపారు. శ్రీ‌వారికి భ‌క్తులు కానుక‌గా అందించిన వ్య‌వ‌సాయ భూముల్లోనూ రైతుల స‌హ‌కారంతో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు.

భ‌క్తుల క్యూలైన్లలో కోవిడ్ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు ప‌రిశీల‌న‌

అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మావేశం అనంత‌రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, శ్రీ‌వారి ఆల‌యంలోని క్యూలైన్ల‌లో భ‌క్తుల సౌక‌ర్యార్థం చేప‌ట్టిన కోవిడ్ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను ఛైర్మ‌న్ ప‌రిశీలించారు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న కాంప్లెక్స్, కంపార్ట్‌మెంట్లలో సోప్ లిక్విడ్‌, చేతి శానిటైజ‌ర్ల వినియోగం, స్కానింగ్ పాయింట్‌, మ‌హ‌ద్వారం వ‌ద్ద ట్రై ఓజోన్ శానిటైజ‌ర్ ప‌నితీరు, భ‌క్తులు భౌతిక‌దూరం పాటిస్తూ ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌డం, ప‌డికావ‌లి వ‌ద్ద క్యూలైన్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, విజివో శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.