COVID PROTOCOL MUST FOR SRIVARI DEVOTEES DURING ANNUAL BRAHMOTSAVAMS-TTD CHAIRMAN _ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలి

SRIVARI SALAKATLA BRAHMOTSAVAMS FROM SEPTEMBER 27 – OCTOBER 5.

 

TIRUMALA, 04 AUGUST 2022: The Srivari Salakatla (annual) Brahmotsavams will be conducted in a grand manner this year from September 27- October 5, and all the devotees who are participating in the mega religious event are requested to follow Covid protocols for their personal safety as well others, said TTD Chairman Sri YV Subba Reddy.

 

Addressing media persons after detailed discussions with TTD, district and police officials on the arrangements of ensuing Srivari annual Brahmotsavams at Annamaiah Bhavan in Tirumala on Thursday evening he briefed on some important measures. Excerpts:

 

* on the first day of annual fete on September 27, the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will present  pattu vastrams to Sri Venkateswara Swamy on behalf of the state government.

 

* Prominent vahana sevas during the Brahmotsavams are – Garuda Vahana Seva on October 1, Swarna Ratham on October 2, Rathotsavam on October 4, Chakra Snanam on October 5.

 

* On first day due to Dwajarohanam event, the Pedda Sesha vahana will commence at 9pm but on all other days vahana sevas are scheduled between 8 am and 10 am in the mornings and 7pm to 9pm in the evenings.

 

* Giving priority to common devotees all privileged, SRIVANI, Rs. 300, Arjitha Sevas, VIP Break (except protocol VIPs) Darshans have been cancelled during these nine days and only Sarva Darshanam will remain operational.

 

* Elaborate arrangements are being made for the Garuda Seva as it fell on the second Saturday of Peratasi month, which is very special for the devotees from Tamilnadu.

 

* A buffer stock of 9 lakh laddus will be maintained.

 

* Since the annual fete is set to take place after two years due to covid Pandemic, heavy pilgrim rush is being anticipated. So it was directed to hold a series of  meetings exclusively with special focus on accommodation, Annaprasadam, Traffic Management and Parking

 

* Adequate number of APSRTC buses deployed for devotees and particularly on Garuda Seva day more buses will be operated.

 

* As this year nearly 4-5 lakhs pilgrims are being expected for Garuda Seva, 20 thousand vehicles are also anticipated. But once the holding capacity of vehicles in Tirumala is completed, separate parking facilities will be arranged in Tirupati and devotees will be transported to Tirumala through RTC buses.

 

* To meet the pilgrim requirements German sheds will also be erected at some vital places with temporary wash room facilities

 

* As a safety measure on Garuda Seva day and next day the 2-wheelers movement on the Ghat roads will be stalled from 11pm of September 30 till 12 noon of October 2.

 

* The artists from Tribal, rural and backward areas will be given opportunities to perform before the vahana sevas this year to encourage their folk arts apart from inviting artistes from other states.

 

* 3500 Srivari Sevakulu will be invited to serve devotees during Brahmotsavams.

 

TTD EO Sri AV Dharma Reddy, District Collector Sri Venkatramana Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, district police and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలి

– భక్తుల కోసం తిరుమల ,అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు

– అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

– రద్దీకి తగ్గట్టు పగడ్బందీ ఏర్పాట్లు

-. టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి


తిరుమల 4 ఆగస్టు 2022: సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు . రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తుండటం ,పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు . బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు .తిరుమల ,అలిపిరి లో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు .

అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఈవో శ్రీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి తో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష జరిపారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు . ఆవివరాలు ఇవీ ….

– సెప్టెంబ‌రు 26న‌ అంకురార్ప‌ణ. అదేవిధంగా, సెప్టెంబ‌రు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం.

– తొలిరోజైన‌ సెప్టెంబర్ 27న సాయంత్రం ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్ప‌ణ‌.

– బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వ‌ర్ణ‌ర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.

– తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ. మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు.

– క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు.

– సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే అమ‌లు. ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.

– పెర‌టాసి మాసం. రెండో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో ర‌ద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు. భక్తులకు విరివిగా అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు .

– భక్తుల రద్దీకి తగ్గట్టు ప్ర‌తిరోజూ 9 ల‌క్ష‌ల లడ్డూల బ‌ఫ‌ర్ స్టాక్.

భ‌ద్ర‌త : సెక్యూరిటీ, పోలీసుల స‌మ‌న్వ‌యంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్ర‌ణ, పార్కింగ్‌ ఏర్పాట్లు. వాహనాల పార్కింగ్ మొత్తం రింగ్ రోడ్డులో చేసి , భక్తులను ఉచిత బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు .

– 24/7 కంట్రోల్ రూమ్‌, సిసి కెమెరాలతో నిఘా.

ఇంజినీరింగ్ : గ్యాల‌రీలు, క్యూలైన్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి.

– అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం.

– నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా. జ‌న‌రేట‌ర్లు సిద్ధం.

– శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు.

ప్ర‌జాసంబంధాల విభాగం : 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు

ఆరోగ్య విభాగం : ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు.

వైద్య విభాగం :. తిరుమల తో పాటు అలిపిరి , తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు.

ర‌వాణా : ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు. గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు.

– తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల నిషేధం. కొండ మీద వాహనాల రద్దీ ని బట్టి అవసరమైతే అలిపిరిలో వాహనాల నియంత్రణ .
హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ : శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ముందు విభిన్న క‌ళారూపాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ఏర్పాటు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల కళాకారులకు అవకాశం.

జెఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్ , ఎస్వీబీసీ సి ఈవో షణ్ముఖ కుమార్ , అదనపు ఎస్పీ లు శ్రీ కులశేఖర్ , శ్రీమతి విమల కుమారి , డిప్యూటీ ఈవో లు శ్రీ హరీంద్ర నాథ్. శ్రీ రమేష్ బాబు ,, వి జి వో శ్రీ బాలిరెడ్డి తో పాటు డిఎస్పీలు , సి ఐ లు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది