CREATE AWARENESS ON HINDU DHARMA AT THE STUDENT STAGE ITSELF-DEO _ విద్యార్థి దశ నుంచే ధర్మం పై అవగాహన కల్పించాలి – టీటీడీ డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి

TIRUPATI, 07 JUNE 2023: The students should be taught about the various ethics embedded in Hindu Sanatana Dharma from their schooling stage itself, said TTD Education Officer Sri Bhaskar Reddy.

 

The DEO attended the one-day summer workshop on Hindu Sanatana Dharma conducted for the children of TTD employees studying between 6th class to 10th class held in SVETA Bhavan in Tirupati on Wednesday.

 

He said the children should be taught on the importance of Hindu Sanatana Dharma, the richness of our culture and tradition, the ethical values taught by the great sages and philosophers etc. from a tender age in schools itself so that the students will emerge as good citizens of the country and will also help them to lead a righteous life in their future. 

 

In this day long workshop held under the supervision of SVETA Director Smt Prasanthi, the students were taught on Sri Venkateswara Divya Vaibhavam, Santana Dharma, personality development, Yoga-Dhyanam, Bhagavat Gita etc.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

విద్యార్థి దశ నుంచే ధర్మం పై అవగాహన కల్పించాలి – టీటీడీ డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి

తిరుపతి 7 జూన్ 2023: పిల్లలకు విద్యార్థి దశ నుంచే ధర్మాచరణ, హిందూ ధర్మం గురించి అవగాహన కల్పించాలని టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు.

శ్వేత లో బుధవారం 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న టీటీడీ ఉద్యోగుల పిల్లలకు సనాతన హిందూ ధర్మంపై ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, మనిషి ఏ విధంగా బ్రతకాలి అని చెప్పేదే ధర్మమన్నారు. పిల్లలకు ధర్మ మార్గంలో పయనించడం, ధర్మాన్ని ఆచరించడం లాంటి విషయాలపై అవగాహన కల్పించడం మంచి కార్యక్రమమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో మంచి ఆలోచనలు కలిగించి వారు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తాయని చెప్పారు.

శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి పర్యవేక్షలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు శ్రీ వేంకటేశ్వర దివ్య వైభవం, సనాతన ధర్మం – పరిచయం, నైతికత – ప్రవర్తన, హిందూ ధర్మంలో మంచి అలవాట్లు- శాస్త్రీయత, వ్యక్తిత్వ వికాసం- భగవద్గీత, యోగ- ధ్యానం, అంశాలపై ఆయా రంగాల్లోని ప్రముఖులు శిక్షణ ఇచ్చారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది