CULTURAL BONANZA AT TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

TIRUPATI, 23 NOVEMBER 2022: It is a day of a cultural bonanza for the devotees who thronged Tiruchanoor to witness the vahana sevas as part of the ongoing annual brahmotsavams in Padmavathi Ammavaru temple on Wednesday.

The cultural feast started with Mangala Dhwani by Sri Nataraja, and Sri Krishna Rao followed by Veda Parayanam while Sri Satya Srinivasa Ayyangar religious discourse and Smt Suseela presented a vocal concert.

Harikatha by Smt Jayanti Savitri, Annamayya Vinnapalu by Smt Kavita and her team, musical vocal by Dr. Vandana, Dance by Smt Usharani and Sri Harinath, a vocal concert by Sri Sudhakar from Nellore, allured devotees at different venues in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

తిరుపతి, 2022 న‌వంబ‌రు 23 ;శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు శ్రీ నటరాజ, శ్రీ కృష్ణారావు బృందం మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు నరసరావుపేటకు చెందిన శ్రీ సత్య శ్రీనివాస అయ్యంగార్ ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సుశీల బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జయంతి సావిత్రి భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమతి రేవతి శ్రీమతి కవిత బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి ఉషారాణి, శ్రీ హరినాథ్ నృత్యం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి నెల్లూరుకు చెందిన సుధాకర్ బృందం సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద హైదరాబాదుకు చెందిన శ్రీమతి లక్ష్మి బృందం సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి మచిలీపట్నం చెందిన శ్రీ వైష్ణవి నృత్యాలయం వారిచే నృత్య కార్యక్రమం జరిగింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.