CULTURAL FIESTA DURING THE NAVARATRI FEST _ పెద్ద‌శేష వాహన సేవలో కళావైభవం

BALAMANDIR STUDENTS PERFORM KOLATAM

TIRUMALA, 15 OCTOBER 2023: The array of dance performances by the artistes from various parts of Andhra Pradesh in front of Vahana Sevas attracted the devotees waiting in four mada galleries on Sunday evening.

The students of SV College of Music and Dance presented Vaggeyakara Vaibhavam while that of SV Balamandir showcased Kolatam. The others included traditional folks art of Garagala, Tappetagullu, Keelugurram, Prahlada Varada Nritya Rupakam etc. 

In total, 16 teams comprising of 431 artistes performed in front of  Pedda Sesha Vahanam on Sunday evening.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

పెద్ద‌శేష వాహన సేవలో కళావైభవం

తిరుమ‌ల‌, 2023 అక్టోబర్ 15: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మొద‌టి రోజైన ఆదివారం రాత్రి పెద్ద‌శేష వాహనసేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.

శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో దేవ‌తామూర్తుల వేష‌ధార‌ణ‌, వారిని స్త‌తిస్తూ త్యాగ‌రాజ‌, రామ‌దాసు ఆల‌పించిన కీర్త‌న‌ల‌కు విద్యార్థులు చ‌క్క‌గా నృత్యం చేశారు. ఇందులో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి, రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ‌కృష్ణుడు, సీతారామ‌ల‌క్ష్మ‌ణ హ‌నుమంతుని వేష‌ధార‌ణ ఆక‌ట్టుకుంది.

అదేవిధంగా, పశ్చిమగోదావరి జిల్లా అరికెరేవులకు చెందిన శ్రీ రోహిణీ కుమార్ బృందం జాన‌ప‌ద నృత్యం, భ‌ర‌త క‌ళాక్షేత్రం భావ‌యామి ర‌ఘురామ‌మ్‌ సంప్రదాయ నృత్యం, ఎస్వీ బాల‌మందిరం విద్యార్థుల కోలాటం, తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన శ్రీ హేమంత్ కుమార్ బృందం ప్ర‌హ్లాద‌వ‌ర‌దుడు- శ్రీ‌నృసింహ‌స్వామి పౌరాణిక ఘ‌ట్టం ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకున్నాయి. వీటితోపాటు కర్నూలు జిల్లా ఆధోనికి చెందిన కోమల బృందం డ్ర‌మ్స్‌, కూచిపూడి నృత్యం, కోనసీమ జిల్లా ముక్కామలకు చెందిన కుమార్ బృందం గ‌ర‌గ‌ళ, తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన వెంకటరమణయ్య బృందం పండ‌రిభ‌జ‌న‌, శ్రీకాకుళం జిల్లా రేగడికి చెందిన అచ్యుతరావు బృందం తప్పెటగుళ్ళు, నెల్లూరుకు చెందిన రాజన్న బృందం కీలుగుర్రాలు, తిరుమలకు చెందిన శ్రీనివాసులు బృందం కోలాటం ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను అల‌రించాయి. మొత్తం 16 బృందాల్లో 430 మంది కళాకారులు పాల్గొన్నారు.

ఈ వాహనసేవలోని కళా ప్రదర్శనలను టీటీడీ జెఈఓ శ్రీమతి సదా భార్గవి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.