CULTURAL PROGRAMMES ENTERTAIN DEVOTEES _ గరుడ వాహన సేవలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంచిన కళా బృందాల ప్రదర్శనలు
Tirupati, 22 November 2025: The sixth evening witnessed unique dance forms that reflect the cultural richness of India in front of Garuda Vahanam on Saturday at the ongoing Tiruchanoor Brahmotsavams.
Odyssey, Mohini Attam, Kuchipudi, Bharatnatyam and many other danceforms that depict the grandeur of their states were presented besides folk dances that attracted the devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
గరుడ వాహన సేవలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంచిన కళా బృందాల ప్రదర్శనలు
తిరుపతి, 2025 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాలు 275 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన 15 మంది కళాకారులు బంజారా నృత్యం, బెంగళూరుకు చెందిన 15 మంది యువతులు కథకళి, పాండిచ్చేరి కారైకల్ చెందిన 25 మంది యువతుల కావడి మైలాసం నృత్యం భక్తులను విశేషంగా అలరించింది.
ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, కూచిపూడి, శ్రీనివాస కళ్యాణం, ఎస్వి బాల మందిరంకు చెందిన 50 మంది విద్యార్థులు కోలాటం ఆకట్టుకున్నాయి.
తిరుపతికి చెందిన సాయినాథ్ బృందంలోని 24 మంది కళాకారుల జానపదం దత్తు నృత్యం, వివిధ దేవతామూర్తుల వేషధారణ, అష్టలక్ష్మిలు, మోహిని అట్టం, ఒడిస్సి భరతనాట్యం, కోలాటాలు, భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.











