CULTURAL TEAMS ENTHRALL DEVOUT WITH ARTFORMS _ పెద్దశేష వాహనసేవలో భారతీయ కళాసంస్కృతుల కనువిందు
Tirumala, 12 October 12, 2016: Traditional cultural performances by artists from across the country captivated devotees during the Pedda Sesha Vahanam procession held on Monday night as part of the ongoing Navaratri Brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala.
A total of 477 artists from 17 cultural teams representing eight states—Andhra Pradesh, Madhya Pradesh, Tamil Nadu, Assam, Odisha, Karnataka, Telangana and Jharkhand—participated in the procession.
The performances showcased several regional art forms, including North Andhra’s Tappetagullu, the Dhimsa dance of the Araku region, Tamil Nadu’s Kuravanji, folk traditions from coastal Karnataka and Assam’s Bihu dance.
The artists received an enthusiastic response from devotees for their expertise.
The vibrant costumes, folk music and rhythmic movements added to the devotional atmosphere of the procession.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
పెద్దశేష వాహనసేవలో భారతీయ కళాసంస్కృతుల కనువిందు
8 రాష్ట్రాల నుంచి 17 కళాబృందాలు.. 477 మంది కళాకారుల ప్రదర్శనలు
తిరుమల, అక్టోబరు 12, 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలతో భక్తులను విశేషంగా అలరించారు. భక్తిభావం ఉట్టిపడే జానపద నృత్యాలు, సంప్రదాయ సంగీతం, రంగురంగుల వేషధారణలతో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ వెల్లివిరిసింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, అస్సాం, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల్లోని 477 మంది కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
విశేషంగా ఆకట్టుకున్న సంప్రదాయ కళారూపాలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉత్తరాంధ్ర ప్రసిద్ధ జానపద కళారూపం తప్పెటగుళ్లు, అరకు ప్రాంత గిరిజన నృత్యం థింసా, తమిళనాడుకు చెందిన కురవంజి నృత్యం, కర్ణాటక తీర ప్రాంత సంప్రదాయ కళారూపాలు, అస్సాంకు చెందిన ప్రసిద్ధ బిహూ నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
లయబద్ధమైన అడుగులు, జానపద సంగీతం, వైవిధ్యభరితమైన కళాప్రదర్శనలతో కళాకారులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందించడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల జానపద కళలకు ప్రోత్సాహం అందించేలా ఈ ప్రదర్శనలు సాగాయి.
శ్రీవారి వాహనసేవల సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళాసంపదను ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని కల్పించాయి.































