CULTURAL UNITY BLOSSOMS DURING BRAHMOTSAVAMS _ కల్పవృక్ష వాహనసేవలో ఆక‌ట్టుకున్న ఇత‌ర రాష్ట్రాల కళాబృందాలు

Tirumala, 3, October 2019:  Chhau, Norda, Ger, Kaliattam-call it by any name, they are all the classical dances of different states, which depicts the cultures of respective states.

EIGHT STATES EXHIBIT THEIR ARTS

It is a convergence of various cultures on a single platform on the fourth day of the ongoing annual Brahmotsavams as about eight states from across the country presented the cultural display by artists which captivated the devotees during Kalpatharu vahana seva on Thursday morning.

NORDA OF MP 

The 15 artists team from Madhya Pradesh led by Sri Aman Chausia regaled the devotees with their erythematic Norda Dance. It is a traditional folk dance of MP.

BANGLA KE CHHAU

Sri Nagendranath Singh and his team of 14 from West presented colorful Chhau dance.

Artists presented the cultural bonanza daily under the aegis of HDPP, Dasa Sahitya Project and Annamacharya Project.

GER OF RAJASTHAN AND KALIYATTAM OF PUDUCHERRY

The team from Rajasthan led by Ukaram Parivar enthused with traditional Ger Dance and those from Puducherry gave a rendering to the traditional dance form Kaliattam. 

GAUR OF CHATTISGARH AND DRUMS OF MAHA

While the Chhattisgarh team led by Sri Kesoram Yadav presented a tribal dance Gaur and the 30 member strong drumbeaters of Maharashtra led by Sri M J Ketkar put the audience into a trance.

KARNATAKA FETE

The sankeertan Dance format by 25 dancers of Karnataka lead by Sri N Raju rocked the Tirumala Mada streets.

Apart from these special art forms, Kolatas by 60 members of Tirupati, Visakhapatnam, Tirumala and folk dances by batches of West Godavari and Hyderabad thrilled the audience.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

కల్పవృక్ష వాహనసేవలో ఆక‌ట్టుకున్న ఇత‌ర రాష్ట్రాల కళాబృందాలు

 అక్టోబరు 03, తిరుమల, 2019:   శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో ఇత‌ర రాష్ట్రాల నుండి విచ్చేసిన క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శనలు ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, దాస‌సాహిత్య ప్రాజెక్టు, అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో వాహ‌న‌సేవ‌ల్లో క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

జాన‌ప‌ద శైలిలో సాగిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ నోర్దా నృత్యం

మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీ అమన్ చౌసియా ఆధ్వర్యంలోని 15 మంది బృందం నోర్దా నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. స్థానిక సంప్రదాయాన్ని ప్ర‌తిబింబిస్తూ జాన‌ప‌ద శైలిలో నృత్యాన్ని ప్రదర్శించారు.

ప‌శ్చిమ‌బెంగాల్ చోడెన్స్ నృత్యం

 పశ్చిమబెంగాల్ కు చెందిన శ్రీ నాగేంధ్రనాథ్ సింగ్ నేతృత్వంలో 14 మంది కళాకారులు చేసిన చోడెన్స్ నృత్యం ఆకట్టుకుంది. 

రాజ‌స్థాన్ గేర్ నృత్యం

 రాజస్థాన్ కు చెందిన శ్రీ ఉక్కురామ్ పరివార్ ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు ప్రదర్శించిన గేర్ డ్యాన్స్ ఆకట్టుకుంది. 

పుదుచ్చేరి కాలియాట్టమ్

 పుదుచ్చేరికి చెందిన ఆర్ట్ అండ్ కల్చర‌ల్‌ శాఖ ఆధ్వర్యంలోని 15 మంది కళాకారులు కాలియాట్టమ్  ప్రదర్శన ఇచ్చారు.  

ఛత్తీస్ ఘడ్ సంప్ర‌దాయ నృత్యం

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి శ్రీ కేశోరామ్ యాదవ్  నేతృత్వంలో 15 మంది కళాకారులు వారి సాంప్రదాయ నృత్యాన్ని లయబద్ధంగా ప్రదర్శించారు.  

మహరాష్ట్ర డ్రమ్స్ వాద్యం

మహరాష్ట్రకు చెందిన శ్రీ ఎం.జీ.కటేకర్ నేతృత్వంలో 30 మంది కళాకారులు వారి సాంప్రదాయ వేషాధారణలో  డ్రమ్స్ వాయించారు. 

క‌ర్ణాట‌క సంకీర్త‌న నృత్యం 

క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగళూరుకు చెందిన శ్రీఎన్. రాజు నేతృత్వంలో 15 మంది కళాకారులు సంకీర్తన నృత్యం ప్రదర్శించారు. 

ఆక‌ట్టుకున్న కోలాటం, జాన‌ప‌ద నృత్యం 

 తిరుపతికి చెందిన శ్రీమతి ప్రమీల నేతృత్వంలో 15 మంది కళాకారులు, విశాఖకు చెందిన శ్రీమతి ఎం.కవిత నేతృత్వంలో 15 మంది కళాకారులు, తిరుమలకు చెందిన శ్రీ కె. శ్రీనివాసులు నేతృత్వంలో 30 మంది కళాకారులు కోలాటం ప్రదర్శించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ ఏ. సురేఖ నేతృత్వంలో 24 మంది కళాకారుల నృత్య ప్రదర్శన చేశారు. పశ్చిమగోదావరికి చెందిన శ్రీ మణికంట,  శ్రీ ఎస్.సాయిబాబు నేతృత్వంలో 70 మంది కళాకారులు రెండు బ్యాచ్ లుగా  జానపద నృత్యం ప్రదర్శించారు.                  
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.