CULTURALPROGRAMMES ALLURE _ రథసప్తమికి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati   01 Feb 20 ; The performance by cultural troupes during Radhasapthami festival being observed at various local temples, allured the pilgrim devotees.

About 750 artistes from 37 groups performed in front of various vahanams at different temples on Saturday and enthralled devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 
రథసప్తమికి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
 
తిరుపతి,2020 ఫిబ్రవరి 01 ;రథస్తమి పర్వదినం సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం  ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయ.
 
 తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారికి నిర్వహించిన సప్తవాహన సేవలలోను, తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో నిర్వహించిన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవల ముందు ఏర్పాటు చేసిన కళాబృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. తిరుపతి పరిసర ఆలయాలలో దాదాపు 37 గ్రూపులలో 750 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో చెక్కభజనలు, కోలాటాలు, చిడతలు, అడుగుల భజన, వెంకన్న భజనలతో  వివిధ కళా ప్రదర్శనలు ఇచ్చారు.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.