IT’S A DAY OF FOLK ARTFORMS _ సర్వభూపాల వాహన సేవలో ఆకట్టుకున్న చండ మేళం, కంసాలే, బిహు, కంజీరానృత్యం, కోలాటాల ప్రదర్శనలు
TIRUPATI, 22 NOVEMBER 2025: The devotees have rejoiced the various folk artforms performed in front of Sarvabhoopala Vahanam on Saturday at Tiruchanoor.
Chandamelam, Kanjeera, Kamsale, Bihu, Kolatams, Drums, Lezim are the different fok dances performed in an impressive manner. A total of 16 groups comprising 300 artistes performed on the sixth morning.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సర్వభూపాల వాహనసేవలో ఆకట్టుకున్న చండ మేళం, కంసాలే, బిహు, కంజీరా నృత్యం, కోలాటాల ప్రదర్శనలు
తిరుపతి, 2025 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సర్వభూపాల వాహనసేవలో చండ మేళం, కంసాలే, బిహు, కంజీరా నృత్యాలు, కోలాటాల ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 16 కళాబృందాలు 300 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
చండమేళం
కర్ణాటక తిరుచూరుకు చెందిన నాన మిత్ర చండీ మేళం బృందంలో మొత్తం 12 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. అదేవిధంగా రాజమండ్రికి చెందిన కుమారి రాణి బృందంలోని 30 మంది యువతులు కేరళ డ్రమ్స్‌తో భక్తులను అలరించారు.
మహారాష్ట్రకు చెందిన శ్రీ లక్ష్మీనారాయణ బృందంకు చెందిన 24 మంది కళాకారులు, జ్యోత్రం చంగ్బలే బృందంలోని 25 మంది కళాకారుల లెస్యూమ్ నృత్యం, సేలంకు గోవిందరాజు బృందంకు చెందిన 15 మంది కళాకారుల కంసాలే నృత్యాలు, కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది














