CVSO INSPECTS CC CENTRE _ శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

Tirumala, 23 September 2017: The Chief Vigilance and Security Officer of TTD Sri Ake Ravikrishna to inspected the functioning of the Central Command centre at Tirumala urged the security personnel to keep a sharp eye to avert mishaps and untoward happenings during the Brahmotsavam-2017.
He said of the 640 CC cameras installed in Tirumala,140 plus cameras are located around Srivari Temple, four Mada streets,Vahbhotsavam etc. ‘We are gully geared to protect the devotees who come in lakhs for the celestial event’ he said. For safety of children, nearly 2 lakh child tags have been kept ready and will be distributed to children at railway stations, bus stands and other venues.
He said the CCC will function on 24×7 basis with dedicated team of 30-40 men trained in monitoring movements of suspicious people and make sure no one caused any hindrances to vahana sevas and cultural activities of Brahmotsavams.
Among others Addl CVSO Sri Ravindra Reddy heads of traffic, CC Centre, VGO etc participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

సెప్టెంబర్‌ 23, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలలో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ తెలిపారు. సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సిసి కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించే విధానాన్ని సివిఎస్‌వో శనివారం మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుమలలో 700 సిసి కెమెరాలను అమర్చామని, తమ సిబ్బంది ప్రతిరోజూ 24 గంటల పాటు సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి వాటిని పర్యవేక్షిస్తారని తెలిపారు. మాడ వీధులు, గొల్లమండపం, వాహనమండపం, గ్యాలరీలు తదితర ముఖ్యమైన ప్రాంతాలలో ఉన్న 154 సిసి కెమెరాల ద్వారా పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టామన్నారు. బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004251111 కు ఫోన్‌ చేస్తే తక్షణం తమ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో టిటిడికి చెందిన ఇంజినీరింగ్‌, శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, ఆరోగ్యం, వైద్యం, విజిలెన్స్‌, అన్నప్రసాదం, రవాణ, ఎలక్ట్రికల్‌ తదితర శాఖల సిబ్బంది అందుబాటులో ఉండి తమ సిబ్బందికి సహకారం అందిస్తారని వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విజివో శ్రీ రవీంద్రారెడ్డి, సెంట్రలైజ్డ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌చార్జి శ్రీగిరిధర్‌, ఎవిఎస్‌వో శ్రీ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.