CVSO CELEBRATES DIWALI WITH DEAF AND DUMB STUDENTS_ బధిర విద్యార్థులతో కలిసి టపాసులు పేల్చిన సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణ

Tirupati, 19 October 2017:The Chief Vigilance and Security Officer of TTD Sri Ake Ravikrishna celebrated Deepavali festival and burnt crackers along with the students of TTD-run SV Deaf and Dumb school in Tirupati on Thursday.

It may be mentioned here that the top cop of TTD adopted the school and would develop its infrastructure and other facilities along with the support of Telugu Association of North America (TANA).

The children enjoyed the special Diwali in their school premises.

Additional CVSO Sri Siva Kumar Reddy, AVSO Sri Gangaraju, DEO Sri Ramachandra, School Principal Smt Nalini were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

బధిర విద్యార్థులతో కలిసి టపాసులు పేల్చిన సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణ

అక్టోబరు 19, తిరుపతి, 2017: టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర శ్రవణోన్నత పాఠశాల, ఎస్వీ బధిర జూనియర్ కళాశాలలో గురువారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టిటిడి సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణ బధిర విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి వారితో కలిసి టపాసులు పేల్చారు. బధిర విద్యార్థులు ఉత్సాహంగా టపాసులు పేల్చి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐ కో-ఆర్డినేటర్ శ్రీ మహదేవనాయుడు, తానా ప్రతినిధి శ్రీ హరి కలిసి విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు వృత్తి శిక్షణ అందించి జీవితంలో స్థిరపడేందుకు తానా తరపున తోడ్పాటు అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విద్యాశాఖాధికారి శ్రీ రామచంద్ర, ఎవిఎస్వో శ్రీ గంగరాజు, బధిర కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నళిన, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తా విశేషాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.