CVSO INSPECTS COTTAGES_ గదుల కోసం దళారులను ఆశయ్రించకండి : సివిఎస్వో శ్రీ ఎ. రవికృష్ణ కాటేజీల్లో ఆకస్మిక తనిఖీలు

Tirumala, 16 July 2017: Appealing to the pilgrims not to approach middlemen and touts for rooms and cottages in Tirumala, the CVSO Sri A Ravikrishna informed the pilgrims to make use of the token system which was introduced by TTD recently to enjoy transparent services.

The top cop of of TTD had inspected SMC, Panchajanyam, Sapthagiri, AMC and Surapuramthota cottages on Sunday along with VGO Smt Vimalakumari and AVSO Sri Srinath Reddy.

Speaking on this occasion he said, if the pilgrims come across any suspicious person, they can inform and alert the vigilance sleuths of TTD immediately without any uncertainty.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గదుల కోసం దళారులను ఆశయ్రించకండి : సివిఎస్వో శ్రీ ఎ. రవికృష్ణ కాటేజీల్లో ఆకస్మిక తనిఖీలు

తిరుపతి, 2017 జూలై 16: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు గదుల కోసం దళారులను ఆశ్రయించవద్దని, టోకెన్‌ జారీ కౌంటర్ల ద్వారా నమోదు చేసుకుని గదులు పొందాలని టిటిడి సివిఎస్వో శ్రీ ఎ. రవికృష్ణ కోరారు. తిరుమలలోని శంకుమిట్ట, పాంచజన్యం, సప్తగిరి, ఏఎంసి, సూరాపురంతోట కాటేజీలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సివిఎస్వో శ్రీ రవికృష్ణ మాట్లాడుతూ గదుల దళారులు తారసపడితే భక్తులు వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. గదలు కేటాయింపు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందించడం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దళారులను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు చేపడతామన్నారు.

ఈ తనిఖీల్లో విఎస్‌ఓ శ్రీమతి విమలకుమారి, ఎవిఎస్వో శ్రీ శ్రీనాథ్‌రెడ్డి బృందం, ఇతర విజిలెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.