DARBAR KRISHNA ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి_

Tirupati, 06 March 2024: As part of the ongoing annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy in Srinivasa Mangapuram, the devotees were filled with religious ecstasy by catching a glimpse of Sri Darbar Krishna on Chandraprabha Vahanam on Wednesday evening.

Spl Gr Deputy EO of the temple Smt Varalakshmi and other office staff, devotees, bhajan and artistes troupes participated in Vahanaseva.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2024 మార్చి 06: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.

వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది.

వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.