DARSHAN TIMINGS CHANGED AT SRI KT AND OTHER SUB TEMPLES _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం, అనుబంధ ఆలయాల ద‌ర్శ‌న వేళ‌ల్లో మార్పు

Tirupati, 8 May 2021: With concern for devotee’s health safety in pandemic Corona environment, TTD has introduced some changes in Darshan hours of Tirupati local temple, Sri Kapileswara Swamy Temple 

TTD is organising Sarva Darshan to devotees from 08.00-11.00 hours after daily morning rituals like Suprabatham, Abhisekam and naivedyam.

In the evening from 4.00 pm after daily rituals like Abhisekam, Archana, Diparadhana and naivedyam Ekantha Seva is performed at 6.00 pm.

 TTD has also rescheduled the Sarva Darshan at all TTD sub-temples at 07.20-10.00 am in the morning and again after naivedyam till 11.00 am.

Thereafter in the evening, all sevas are observed in Ekantha only.

The list of TTD sub-temples with changed Darshan timings are: Sri Kodandarama Swamy temple at Chandragiri, Sri Seshachala Lingeswara temple at Kandulavarupalli, Sri Prasanna Venkateswara Swamy Temple in Mangalampeta, Sri Venkateswara Swamy Temple in Tondamanadu, Sri Alaghamalla Krishna temple at Munnar Paluru of Sulurpeta Mandal of Nellore district.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం, అనుబంధ ఆలయాల ద‌ర్శ‌న వేళ‌ల్లో మార్పు

తిరుపతి, 2021 మే 08: కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా, భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌తను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయం, అనుబంధ ఆలయాల ద‌ర్శ‌న వేళ‌ల్లో టిటిడి మార్పులు చేప‌ట్టింది.

శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయం, ఉప ఆలయాల్లో ప్ర‌తి రోజూ ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, అభిషేకం, నైవేద్యం అనంతరం ఉదయం 8 నుండి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి అభిషేకం, అలంకారం, అర్చన, నైవేద్యం, దీపారాధన చేపట్టి సాయంత్రం 6 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

అదేవిధంగా, ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కందులవారిపల్లిలోని శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర‌స్వామివారి ఆలయం, మంగళంపేటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయం, తొండమనాడులోని శ్రీ వేంకటేశ్వర ఆలయం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరులోని శ్రీ అళఘు మల్లారి కృష్ణస్వామివారి ఆలయాల్లోనూ దర్శన సమయాల్లో మార్పు జరిగింది. ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, నైవేద్యం, ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 10 నుండి 10.30 వరకు నైవేద్యం అనంతరం 11 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి నైవేద్యం, దీపారాధన చేపట్టి సాయంత్రం 6 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.