“DASA SAHITYA BHAJAN MANDALIS SHOULD SPREAD TO OTHER STATES TOO”-EO_ గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలి – ధర్మ ప్రచారంలో యువతను భాగస్వాములను చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 25 June 17: Complimenting the Dasa Sahita Project authorities for wide spreading the Bhakti cult through bhajan mandalis in southern states, the TTD EO Sri Anil Kumar Singhal strongly felt that it should extend its wings to other states in the country also and TTD will provide the required financial aid in this noble mission.

Addressing the three thousand odd Dasaparas in III Chowltry premises in Tirupati on Sunday evening, the EO said, Dasa Sahitya Project of TTD is doing commendable services in Sanatana Dharma Prachara through Dasa Keertans in nook and corner of various states of South India and also in Orissa and Maharastra. “But I feel that it should also spread to the East and other Northern states. There is a great responsibility on us to teach the the youth about the values embedded in our dharma through bhajans as they are considered to be the best and easiest way to reach masses in Kaliyuga”, he observed.

In his address Tirupati JEO Sri P Bhaskar said, Bhajana Sampradayam is best promoted by Dasa Sahitya Project of TTD. “Though the project has Kannada Dasa Bhajans many devotees from Telugu speaking states are registering as teams and learning the Keertans and propagating them in villages which is a welcoming aspect”, he added.

The SO of the project Dr P Anandateerthacharyulu informed the EO and JEO about the activities of the project and importance of Traimasika Metlotsavam.

Earlier some Bhajana Mandali members hailing from East Godavari, West Godavari, Guntur expressed their pleasure about being part of this divine mission.

Later EO and JEO felicitated Sri Mukundeswara Rao, a 76-year retired Bank Officer from West Godavari who dedicated his entire life in divine service by promoting over 360 Dasa Bhajana Mandalis in Guntur in two years span and a philanthropist Sri Srinivasa Rao who contributed largesse by providing financial aid to accomplish the mission in Guntur.

Earlier Shobha Yatra was performed from Sri Govinda Raja Swamy temple to III NC Chowltry with thousands of Dasaparas singing bhajans which reverberated in the temple city on Sunday evening.

Deputy EO Sri Damodaram was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలి – ధర్మ ప్రచారంలో యువతను భాగస్వాములను చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

కలియుగంలో నామ సంకీర్తన మోక్ష ప్రదాయని : తిరుపతి జెఈవో

తిరుపతి, 2017 జూన్‌ 25: దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గల భజన మండళ్ల సభ్యులు ప్రజలలో భక్తి భావాని పెంపొందించేందుకు గ్రామస్థాయి నుండి భజన మండళ్లను పటిష్ఠం చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పిలుపునిచ్చారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి 3వ సత్రం ప్రాంగణంలో ప్రాంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమంలో టిటిడి ఈవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ ప్రచారంలో యువతను భాగస్వాములను చేయాలన్నారు. దాససాహిత్య ప్రాజెక్టులోని భజన మండళ్ల సభ్యులు క్రమశిక్షణ, నైపుణ్యం కలిగి వున్నట్లు తెలిపారు. భజన మండళ్ల సభ్యులు తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసి, మంచి నడవడిక అలవర్చాలన్నారు. వేదాలు, ఉపనిషత్తులలోని సారాంశాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా తెలుగులో అన్నమయ్య, కన్నడలో హరిదాసులు తమ కీర్తనల ద్వారా విశేష కృషి చేశారని వివరించారు. సనాతన హైందవ ధర్మం ప్రచారం చేయవలసిన బాధ్యత టిటిడిపై వుందన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు బలోపేతానికి, మెట్లోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు టిటిడి తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు.

అంతకుముందు తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం భజన మండళ్ల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమం అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విగ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని అన్నారు. అందులో భాగంగా మరిన్ని రాష్ట్రాలలో దాస సాహిత్య ప్రాజెక్టు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం గుంటూరు జిల్లా గోవాడకు చెందిన శ్రీ జి.శ్రీనివాసరావు, కిష్కిందపాళ్యంకు చెందిన శ్రీ ముకుందేశ్వరస్వామిలను టిటిడి ఈవో శాలువతో సత్కరించారు. వీరు ఇరువురు గుంటూరు జిల్లాలోని అన్ని గ్రామాలలో దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండళ్లను ఏర్పాటు చేసి, వారికి సాంప్రదాయ భజనలు, కోలాటాలు, కీర్తనలలో విస్కృత శిక్షణ ఇస్తున్నారు.

ఈ కార్యక్రమంలో దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ దామోదరం, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.